తెలంగాణ రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి ..
ఒకవైపు నిరుద్యోగులు రోడెక్కి సీఎం రేవంత్ పై నిరసనలకు దిగారు … మరోవైపు రుణమాఫీ … ఎన్నికల ముందు సీఎం రేవంత్ ఇచ్చిన హామీల దిశగా కొత్త పుంతలు తొక్కుతున్నారు రేవంత్ … కానీ ఇచ్చిన హామిల సంగతి ఆలా ఉంటె … రాష్ట్ర నిధులు సరిపోవడం లేదు అని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు … అయినా రేవంత్ నిద్రటింది మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలపైకసరత్తు షురూ చేస్తున్నారు … ముఖ్యంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఓ కొత్త పథకాన్ని తెర మీదికి తీసుకొచ్చింది..అసలే ఇచ్చిన హామీల సంగతేంటి అని ప్రత్యర్థులు ప్రశ్నింస్తుంటే మరో పథకం అంటే కాస్త కష్టమే అంటున్నారు ….
ఆ
కొత్త పథకం ఏంటి … ఎప్పుడు అమలవుతుంది ?
దీనికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది. ఈ పథకాన్నిత్వరలో రేవంత్ రెడ్డి ప్రారంభించబోతోన్నారు.. అదే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం. ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉద్దేశించిన పథకం ఇది. దీని కింద ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్… ఈ పథాకన్ని రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించనున్నారు…
గతంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్ 1 పరీక్షలను రాయబోయే అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలను రాయబోయే అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది…
అలాగే ఉచిత కోచింగ్‌తో పాటు ప్రతి నెలా 5,000 రూపాయల చొప్పున మొత్తాన్ని స్టైపెండ్‌గా అందించనుంది… హైదరాబాద్‌లో సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8, ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్లల్లో ఈ ఉచిత కోచింగ్ కొనసాగుతుంది. 75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ స్టడీ కాలంలో అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు..సో మొత్తానికి ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి …అదే సమయంలో ప్రిలిమ్స్ అభ్యర్థుల కోసం కొత్తగా ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి కావాల్సిన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం విడుదల చేయనుంది…మొత్తానికి మరో కొత్త పథకంతో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు గుండెల్లో చిరకాలం ఉంటారు … అన్ని సెట్ అయ్యి ఈ పథకం అమలు అయ్యే వరకు ఏ ప్రభుతాన్ని నమ్మలేము ..