ఆర్దిక మంత్రి భట్టి అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఎన్నికల్లో పరాజయం తరువాత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలి సారి అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ పైన స్పందించారు. బడ్జెట్ లో కొత్తదనం లేదని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వం పాలసీనే ఖరారు చేయలేదన్నారు. ఈ బడ్జెట్ పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేసారు. తెలంగాణకు హాజరైన కేసీఆర్ బడ్జెట్ తరువాత కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని చెప్పుకొచ్చారు… ఈ తరుణంలో బడ్జెట్ పై కేసీఆర్ రెచ్చిపోయారు … ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పై
విరుచుకుపట్టారు … ఇది రైతు శత్రు ప్రభుత్వంగా కాంగ్రెస్ మార్చేసిందని, ఈ బడ్జెట్ ను అసెంబ్లీలో చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. రైతులకు వెన్నుపోటు పొడిచేలా బడ్జెట్ ఉందని… ఆర్థికమంత్రి వొత్తి వొత్తి మాట్లాడటం తప్పా బడ్జెట్ లో ఏమీ లేదని కేసీఆర్ విమర్శించారు. రైతుబంధు ఎగ్గొట్టేలా ఉన్నారని, వ్యవసాయ స్థిరీకరణతో పాటు ఐటీ పాలసీలే లేవన్నారు. కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇవ్వాలని అనుకున్నామని… కానీ పూర్తిగా ఫెయిల్ అయ్యారని కేసీఆర్ ఆరోపించారు.
ఈబడ్జెట్ లో ఒక్క పథకంపైనా క్లారిటీ లేదని కేసీఆర్ వివరించారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని వ్యాఖ్యానించారు. రైతులను పొడిగినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. దళిత బంధు అమలు చేయకుండా దళిత వర్గాన్ని మోసం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏ వర్గానికి భరోసాలేదన్నారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదన్నారు. ఉన్న పథకాల గురించే గొప్పగా చెప్పుకొనే ప్రయత్నం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వారికి ఆరు నెలల సమయం ఇవ్వాలనుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ బడ్జెట్ చూస్తే ఏ ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం పాలసీనే ఖరారు చేయలేదని పేర్కొన్నారు. తాము రైతుబంధు రెండు పంటలకు ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. రైతులకు విత్తనాలు, నీరు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. బడ్జెట్ లో రైతు బంధు, భరోసా ప్రస్తావనే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఇన్ని నెలలు అవుతున్నా ఇండస్ట్రియల్ పాలసీ లేదని.. కధలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏ వర్గానికి భరోసా దక్కలేదన్నారు. మహిళలకు ఇచ్చిన హామీల ప్రస్తావన లేదన్నారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని..కొత్తదనం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.