ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు… దీనిపై పెద్ద రచ్చే జరుగుతుది .. అయినా బీజేపీ నేతలు సైలెంట్ గా ఉన్నారు ..
ఓ పక్క ఏపీకి 15 వేల కోట్ల నిధులతో పాటు రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించారు. కానీ తెలంగాణకు నిధుల ప్రస్తావన తేలేదు. గత 10 ఏళ్లుగా ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపారు. ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మళ్లీ అవమానమే ఎదురయింది … ఈ నేపథ్యంలో
తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మొదటి సారి శాసన సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మొత్తం తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 91 వేల 159 కోట్లుగా, రెవెన్యూ వ్యయం 2లక్ష20 వేల945 కోట్లుగా భట్టి విక్రమార్క పద్దులను ప్రవేశపెట్టారు. 2024 – 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో భాగ్యనగరం అభివృద్ధికి భారీగానే నిధులను కేటాయించినట్టుగా భట్టి విక్రమార్క బడ్జెట్ లెక్కలలో చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయల కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ బడ్జెట్లో పాతబస్తీ మెట్రో విస్తరణకు కూడా తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని ఈ కేటాయింపులతో తెలిపారు.
పాతబస్తీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టంకు 50 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇదే సమయంలో మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం 1500 కోట్ల రూపాయలు, ఇక హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్ధి కోసం 10వేల రూపాయల కోట్ల కేటాయించినట్లు తెలిపారు. ఇందులో జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతుల కల్పన కోసం 3065 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కు 3385కోట్లు, హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, అవుటర్ రింగ్ రోడ్డు కోసం 200కోట్ల రూపాయలు కేటాయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ దగ్గర సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హైదరాబాద్ నగరాన్ని మెట్రోపాలిటన్ నగరంగా ముందు వరుసలో నిలపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నది అన్నారు .. బడ్జెట్ స్పీచ్ లో గత ప్రభుత్వం పై విరుచుకుపడిన భట్టి విక్రమార్క గత పదేళ్ళ అస్తవ్యస్త పాలనకు, తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని పేర్కొన్నారు. గత పాలకులు బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారని విమర్శించారు.