Home » బాధ్యతలు స్వీకరించిన తెలుగు రాష్ట్రల కేంద్ర మంత్రులు

బాధ్యతలు స్వీకరించిన తెలుగు రాష్ట్రల కేంద్ర మంత్రులు

by malakapalli
0 comment
Indian Government - Gold Andhra

తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నాయకులు గురువారం తమ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కె. రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతంర మాట్లాడుతూ… సులభతర విమానయానానికి తాను అత్యధిక ప్రాధాన్యం యిస్తానని అన్నారు. విమాన ఛార్జీల గురించి మాట్లాడుతూ… విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గుదలకు తాను కృషి చేస్తానని విమాన ప్రయాణం మరింత సులభతరం చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆ శాఖ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి – నిత్యానంద రాయ్, హంపి మఠానికి చెందిన విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం మఠాధిపతి – జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోది, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల మార్గదర్శకత్వంలో దేశానికి అంకిత భావంతో కృషి చేస్తానని బండి సంజయ్ ఈ సందర్భంగా తెలిపారు. అంతకముందు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి సైతం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved