పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి అనే చెప్పాలి .. మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా పరాజయం చూసింది .. అయితే బీఆర్ఎస్ లో వలసల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కాంగ్రెస్ లోకి చేరిపోతుండగా, ఆ పార్టీకి రాజ్యసభలో ఉన్న నలుగురు సభ్యులూ గంపగుత్తగా కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మనుగడపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ వ్యవహారాలలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. పార్టీ నుంచి వలసలను నిరోధించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన చేతులెత్తేశారు. ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుందన్న ధోరణిలో కేసీఆర్ ఉన్నారు.
ముఖ్యంగా అసెంబ్లీ , లోక్ సభ పరాజయాలు ఆ పార్టీ ఉనికిని ప్రస్నార్ధకం చేస్తున్నాయి .. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటములతో క్యాడర్ డీలా పడింది. అసెంబ్లీ ఎన్నికలో కనీస స్థాయిలో సీట్లు సాధించినా .. పార్లమెంట్ ఎన్నికల్లో బోణి కూడా కొట్టకపోవడం .. పార్టీ శ్రేణుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది .. అయినా అర్ బీఆర్ఎస్ అగ్ర నేతలు మౌనంగా ఉండటంపై కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. పార్టీని బలోపేతం చేసే ఆలోచన .. పార్టీని బతికించుకోవాలనే ఆరాటం అధినాయకత్వంలో కనిపించడం లేదనే భావన క్యాడర్ లో ఏర్పడుతుంది .. ఇప్పటి వరకు పార్టీ పరిస్థితిపై సమీక్షలు కూడా లేకపోవడంతో కింది స్థాయి నేతల్లో నిరూత్సాహం ఏర్పడింది. ఒకరకంగా అధిష్టానం వైఖరితో పార్టీ పరిస్థితి ఆత్మహత్య చేసుకున్న తీరుగా మారిందనే చర్చలు సాగుతున్నాయి .
ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారగా.. మరికొంతమంది ఎమ్మెల్యేలు అదే దారిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.. మరోవైపు బీజేపీ కూడా బిఆర్ఎస్ పై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది ..అయినా పార్టీ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం శ్రేణుల్ని ఆశ్చర్య పరుస్తుంది .. దీనితో క్యాడర్ లో భరోసా లేకుండానే పార్లమెంట్ ఎన్నికలకి వెళ్లి ఘోరంగా బోల్తా పడింది .. 17 సీట్లలో పోటీ చేసిన గులాబీ పార్టీ ఒక్క సీటు గెలవలేకపోయింది … ఎనిమిది లోక్ సభ స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు . అంతే కాక ఓట్ల శాతాన్ని సగానికి పైగా కోల్పోయింది. ఓటమి తర్వాత అన్న మేలుకున్నారా అంటే అది లేదు ..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేసి సైలెంట్ అయ్యారు .. గులాబీ దళపతి కేసీఆర్ జాడే లేదు .. ఓటమిపై ఇప్పటి వరకు సమీక్షలు లేవు ..దీంతో శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీని తిరిగి గాడిలో పెట్టాలనే ఆలోచన పార్టీ పెద్దలకు అసలు ఉందా అనే భావన క్యాడర్ లో వ్యక్తం అవుతోంది. అందుకే పార్టీ లో ఉన్న లీడర్స్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు .. అందులోకి వలసలు పట్టారు ..
శాసనసభ , లోక్ సభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా అగ్రనేతల్లో మార్పు రాలేదని అంటున్నారు ..
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలని అడ్డుకోలేదు.. ఇప్పుడు ఆ పార్టీయే కారుని కబళించడానికి సిద్ధం అయింది . మరోవైపు వరుస కేసులు ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి .. ఇప్పటికే కవిత అరెస్ట్ అయింది ఫోన్ ట్యాపింగ్ అస్త్రం కేటీఆర్ కి , విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాల అంశం కేసీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది .. సరిగ్గా ఇదే సమయంలో బిఆర్ఎస్ పార్టీని తుడిచి పెట్టేస్తేనే రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా నిలబడగలమని బీజేపీ భావిస్తుంది .ఈ అవకాశాన్ని బీజేపీ వదులుకోదు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎదో ఒక రీతిలో ఎత్తుకుపోయేందుకు ప్రయత్నిస్తుంది.
కనుక బిఆర్ఎస్ పార్టీ చెల్లాచెదురు కాకుండా కాపాడుకోవడమే కేసీఆర్ కి పెద్ద సవాల్ గా మారింది … ఇక లోక్ సభా ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓట్లు బీజేపీ కి పడ్డాయి .. అది ఈ ఎన్నికకు పరిమితం కాకుండా ..బీజేపీ ఆ ఓటు బ్యాంక్ ని తమ వైపు తిప్పుకుంటే కారుకి మరింత డ్యామేజ్ ఖాయం అంటున్నారు విశేషకులు ..