బుల్లితెరపై బిగ్బాస్ షోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగులో 7 సీజన్స్ పూర్తి అయ్యాయి . అలాగే ఓటిటిలో ఒక సీజన్ పూర్తి అయింది .. ఇక గతేడాది సీజన్ 7 సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో సీజన్ 8 కోసం సరికొత్తగా రంగం సిద్ధం చేశారు . ఈఏడాది సామజిక మాధ్యమాల్లో బాగా ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది . సీజన్ 7 సక్సెస్ అయినట్లే .. సీజన్ 8 కూడా సూపర్ సక్సెస్ చేసేందుకు ప్రణాళికలు రెడీ చేశారని సమాచారం .. ఈ క్రమంలోనే సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు వైరల్ అవుతున్నాయి .
వైరల్ అవుతున్న లిస్టు చూస్తే . యాంకర్ అంజలి , వింధ్య, నయని పావని, నిఖిల్ పేర్లు వినిపిస్తున్నాయి .. జబర్దస్త్ నుంచి కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, బుల్లెట్ భాస్కర్ పేర్లు ఉన్నాయి ..అలాగే అమృతా ప్రణయ్, కుమారీ ఆంటీ.. బర్రెలక్క పేర్లు కూడా వైరల్ అయినా జాబితాలో ఉన్నాయి ఇక సోనియా సింగ్.. బమ్ చిక్ బబ్లూ.. కుషితా కల్లపు.. సురేఖ వాణి కూతురు సుప్రిత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని బిగ్ బాస్ కంటెస్టెంట్గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది
ఈ క్రమంలోనే తాజాగా బిగ్బాస్ సీజన్ 8 గురించి అప్డేట్ ఇచ్చాడు నాగార్జున. ఈ షో ముందు నుంచే వెరైటీ ప్రమోషన్లతో హడావుడి స్టార్ట్ చేశాడు.
తాజాగా బిగ్బాస్ సీజన్ 8 కొత్త లోగో రివీల్ చేస్తూ అసలు ప్రోమో రిలీజ్ చేశాడు నాగార్జున. అయితే ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభమనే విషయాన్ని మాత్రం చెప్పలేదు… దానికోసమే తెలుగు ప్రజలు వెయిట్ చేస్తున్నారు …ఎంటర్టైన్మెంట్ తీసుకువచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా ? అంటూ కొత్త లోగోను షేర్ చేశాడు నాగార్జున. తాజాగా విడుదలైన కొత్త లోగో కలర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. కొద్దిరోజులుగా కంటెస్టెంట్ లిస్ట్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర సీరియల్స్, యాంకర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఫేమస్ అయినవారిని, యూట్యూబర్స్ ను కూడా తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయితే ఈ సీజన్ ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్బాస్ షో స్టార్ట్ చేయనున్నారు. తాజాగా నాగార్జున షేర్ చేసిన బిగ్బాస్ సీజన్ 8 ప్రోమో నెట్టింట వైరలవుతుంది.