బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగులో 7 సీజన్స్ పూర్తి అయ్యాయి … ఇక గతేడాది సీజన్ 7 సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో సీజన్ 8 కోసం సరికొత్తగా రంగం సిద్ధం చేశారు . ఈఏడాది సామజిక మాధ్యమాల్లో బాగా ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది . సీజన్ 7 సక్సెస్ అయినట్లే .. సీజన్ 8 కూడా సూపర్ సక్సెస్ చేసేందుకు ప్రణాళికలు రెడీ చేశారని సమాచారం .. ఈ క్రమంలోనే సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు వైరల్ అవుతున్నాయి .
వైరల్ అవుతున్న లిస్టు చూస్తే . యాంకర్ అంజలి , వింధ్య, నయని పావని, నిఖిల్ పేర్లు వినిపిస్తున్నాయి .. జబర్దస్త్ నుంచి కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, బుల్లెట్ భాస్కర్ పేర్లు ఉన్నాయి ..అలాగే అమృతా ప్రణయ్, కుమారీ ఆంటీ.. బర్రెలక్క పేర్లు కూడా వైరల్ అయినా జాబితాలో ఉన్నాయి ఇక సోనియా సింగ్.. బమ్ చిక్ బబ్లూ.. కుషితా కల్లపు.. సురేఖ వాణి కూతురు సుప్రిత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే గత సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ షోకి హైప్ తీసుకువచ్చాడు .. అన్నా రైతు బిడ్డనన్నా.. బిగ్ బాస్‌లోకి తీసుకోండన్నా అని వీడియోలు పెడుతుంటే. పిచ్చోడి అనుకున్నారు .. అయితే బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే తీరుతా అని చెప్పి మరీ … హౌస్‌లోకి అడుగుపెట్టాడు. పట్టుదలతో హౌస్ లో పోరాడి .. రైతు బిడ్డ ట్యాగ్ ని ఊస్ చేసుకొని బిగ్ బాస్ విజేతగా అవతరించాడు.. మరి బిగ్ బాసుకి అంతగా హైప్ తీసుకువచ్చిన రైతు బిడ్డ అనే కాన్సప్ట్ ని రైతు బిడ్డని ఎవరినైనా ఈ సారి కంటెస్టెంట్ గా తీసుకుంటారా అనేది హాట్ టాపిక్ గా మారింది …
అయితే సీజన్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కామన్ మెన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. వెళ్లడమే కాదు.. అనూహ్య రీతిలో ఆట ఆడి.. బిగ్ బాస్ హౌస్‌కి తొలి కెప్టెన్ కావడమే కాకుండా.. హౌస్ మేట్ అయ్యాడు.. ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు.. 14 వారాల పాటు తన ఆటకి సాటే లేదు అన్నట్టుగా రైతు బిడ్డ చెమటచిందించి సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌కి చెమటలు పట్టించాడు.. 14వ వారాలు హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ గా బయటకు వచ్చాడు. ఇక సీజన్ 8 లో కూడా మరో రైతు బిడ్డకు మెకర్స్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతను కూడా వ్యవసాయం చేస్తాడనే టాక్ అయి వినిపిస్తుంది…ఈసారి కూడా రైతు బిడ్డను తీసుకొచ్చి సెలెబ్రెటీస్ పైకి ఉసిగొలుపుతారా అన్నది .. అలాగే రేటింగ్ విషయం కూడా అలోచించి ఇదంతా ప్లాన్ చేస్తున్నారని టాక్..