ఈ నెలలో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేటు చేసుకున్నాయి.. ఏదైనా రాజకీయాల్లో పని స్టార్ట్ చేయాలంటే .. ముహుర్తాలు చూసి మరి ప్రారంభిస్తారు .. దానిలో భాగంగా
ఇందుకు శ్రావణ మాసాన్ని ముహూర్తంగా ఎంచుకున్నాయి పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ లు ఈ శ్రావణ మాసంను శుభముహూర్తంగా ఎంచుకొని మార్పులు చేపట్టేందుకు రెడీ అవ్వగా.. బీఆర్ఎస్ లో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపించడం లేదు.. ఆ పార్టీ లో మార్పులు కూడా చేయడానికి ఏముందని .. పార్టీ మొత్తం ఖాళీ అవుతుంటే .. అయితే తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిని ఆషాఢ మాసం ముగిసిన అనంతరం శ్రావణ మాసంలో నియమించాలని ఫిక్స్ అయింది. ఈమేరకు అధిష్టానం కసరత్తు కూడా పూర్తి చేసిందని..రేవంత్ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి రాగానే పీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై అధికారిక ప్రకటన శుభ ఘడియల్లో ఉండనుంది… ఇక, మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టాలని ఫిక్స్ అయింది కాంగ్రెస్. ఆరు ఖాళీలకు గానూ నాలుగు ఖాళీలను శ్రావణం మాసంలోనే భర్తీ చేయాలని భావిస్తున్నారు.
హైదారాబాద్ ,రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఈ మంత్రివర్గ విస్తరణలో బెర్త్ కన్ఫాం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి… దీంతో ఎవరెవరికి అవకాశం దక్కుతుంది అని ఆశావహులు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు.. మళ్ళీ పార్టీ లో మార్పులు కనిపిస్తున్నాయని కొందరి వాదన .. మరోవైపు..బీజేపీలో కూడా నూతన అధ్యక్షుడిని ప్రకటించాల్సి ఉంది. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటంతో ఆయన స్థానంలో జులై నెలాఖారులో కొత్త ప్రెసిడెంట్ పోస్ట్ భర్తీ చేస్తారని హైకమాండ్ లీకులు ఇచ్చినా…ఇప్పటివరకు ముందడుగు పడలేదు. ఆషాఢ మాసం కారణంగానే ఆలస్యం చేస్తున్నారు. దీంతో కొద్ది రోజుల్లోనే శుభ శ్రావణంలో ప్రెసిడెంట్ పోస్ట్ ప్రకటన ఉండనుంది. ఇక మిగిలింది బీఆర్ఎస్..ఆ పార్టీలో శ్రావణంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ మరుస్తారని వార్తలు వచ్చినా…కేటీఆర్ భవిష్యత్ కు ఇబ్బంది అవుతుంది అని బీఆర్ఎస్ అధిష్టానం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కానీ, ఈ శ్రావణంలో కవితకు బెయిల్ వస్తే అదే బీఆర్ఎస్ కు శుభ శ్రావణంగా మారనుంది.