తెలంగాణ రాజకీయాల్లో ఆపరేషన్ ఆకర్ష్ పై పెద్ద రచ్చే నడుస్తుంది …
ఆపరేషన్ ఆకర్ష్ అంటే .. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తోంది.. బీఆర్ఎస్ నేతలు ఆకర్షితులవుతున్నారు.. మొత్తం రాజకీయం కదంతా ఈ రెండు పార్టీల మధ్యే నడుస్తుంది .. కానీ మరో కీలకమైన పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఆకర్ష్ రాజకీయాల్లోకి రావడం లేదు. . ఎందుకో ఈ మధ్య బీజేపీ పార్టీ కొన్ని విషయాలకు దూరంగా ఉంటుంది ..అటు నిరుద్యోగుల .. ఇటు పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నా బీజేపీ మౌనం గా ఉంది చూస్తుంటే తప్ప … కాంగ్రెస్ తో పెట్టుకోవడం ఎందుకు అనుకున్నాదో ఏమిటో తెలియదు కానీ…సైలెన్స్ వెనకాల కదేంటీ అనేది తెలియాల్సి ఉంది .. ఇతర నేతలకు రాష్ట్ర స్థాయిలో చేరికలకు ప్రయత్నించే బాధ్యతలు కూడా ఇవ్వకపోవడంతో ప్రయత్నించడం లేదా అన్నది సస్పెన్స్ గా మారింది… మోడీ మూడవ సారి అధికారంలోకి వచ్చాక .. కేసీఆర్ కి సపోర్ట్ చేసి బిఆర్ ఎస్ కి బలం చేకూరుస్తుంది అనుకుంటే … కానీ బీజేపీ మొత్తానికి తప్పించుకొని ఉంటుంది …. అలాగే కవిత లిక్కర్ కేసు లో ముఖ్యముగా కేసీఆర్ , కేటీఆర్ బీజేపీ ని ఆశ్రయించిన బీజేపీ నేతలు గప్ చిప్ గా ఉన్నారు ..
అయితే తెలంగాణ రాజకీయ పరిణామాల పట్ల పూర్తి స్పష్టతతో ఉన్న బీజేపీ కేంద్ర పార్టీ పెద్దలు.. ఎలాంటి దూకుడు అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.. దూకుడుకి పొతే పార్టీ మళ్ళీ ఊబిలో పడుతుందని అంచనా వేసుకొని సైడ్ అవుతున్నారు …
అలాగే పార్టీలో చేరికలపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసారు .. భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఎవరు ఎప్పుడు పార్టీ వీడిపోతారోనన్న టెన్షన్ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు వచ్చి చేరిపోతానన్న టెన్షన్ ఉంది. .. అక్కడ వెళ్లిపోతారని బాధ అయితే ఇక్కడ చేరుతారన్న బాధ కూడా ఉంది.. కొత్త వాళ్ళు వచ్చి చేరితే మళ్ళీ వాళ్లకు పదవులు ఇవ్వాలి …పార్టీ లో కొనసాగుతున్న కొందరికి కాదని… కొత్తవారికి అవకాశం ఇస్తే బీజేపీ లీడర్స్ ఊరుకుంటారా ? అనేది కూడా ఒక గా గా చూపిస్తున్నారు ….
ఈ నేపథ్యంలో ఒక వైపు కేసీఆర్ తన పార్టీ లీడర్స్ ను కాపాడుకునే పనిలో పడ్డారు .. కేటీఆర్ ఢిల్లీ లో మంతనాలు జరుపుతున్నారు .. పార్టీ ఫిరాయింపులు కరెక్టు కాదని చెప్తున్నారు …
కేసీఆర్ ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టి పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నారు. భవిష్యత్ మనదేనని చెబుతున్నారు. కానీ ఆ సమావేసాలకు వెళ్లిన వారు కూడా పార్టీ మారిపోవడానికి దారులు వెదుక్కుంటున్నారు. ఎమ్మెల్సీలు కూడా అదే చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్టేమిటంటే ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే రానీ ఎమ్మెల్సీ కానీ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ వైపు చూడటం లేదు… కాంగ్రెస్ లో చేరితే పదవి వస్తుందని ..అదేకాకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయితే బెస్ట్ అని అభిప్రాయపడుతున్నారు … అదీకాకుండా స్వయంగా సీఎం రేవంత్ రంగంలోకి దిగి అందరిని ఆహ్వానిస్తున్నారని అందుకే కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు …
అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ కు తెలంగాణలో పవర్ ఉండవచ్చు కానీ.. బీజేపీకి కేంద్రంలో పవర్ ఉంది. అయినా బీజేపీ వైపు చూడటం లేదు. ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు బీజేపీ కూడా ఆసక్తి చూపిస్తుంది. అందులో సందేహం ఉండదు. ఎమ్మెల్యేల చేరిక అంటే పార్టీకి బలమే. ఎమ్మెల్యేతో పాటు క్యాడర్ కూడా వస్తుంది. బీజేపీకి ఇప్పుడు ద్వితీయ శ్రేణి నేతల బలం అవసరం. కానీ అవకాశం దొరికినా … మొత్తం ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కు వదిలేస్తోంది కానీ.. తమ పార్టీలో చేర్చునేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. పార్టీలో చేరుతామని వస్తే బీజేపీ ఎవరినైనా చేర్చుకుంటుందేమో కానీ.. కాంగ్రెస్ తరహాలో ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. చేరుతామని వచ్చే వారి విషయంలో మాత్రం ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. కానీ రాజీనామాలు చేయాలని షరతు పెడతామని బండి సంజయ్ ప్రకటించారు .. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తే ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సరి పెట్టుకోరు భారీ స్థాయిలో చేయాలనుకుంటారు.