ఏపీ లో రాజకీయాలు దుమ్ము లేపుతున్నాయి ..
ఒకవైపు అధికారంలో ఉన్న చంద్రబాబు .. మరోవైపు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ..గత ప్రభుత్వం లో ప్రజలు చాలా మోసపోయారని .. స్కీమ్స్ పేరుతో ప్రజల్ని జగన్ మోసం చేసాడని .. కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పజెప్పారు ప్రజలు .. అయితే పాలనా పగ్గాలు చెప్పటిన చంద్రబాబు ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ అవినీతిని, వైఫల్యాలను ఎండగడుతుంది… జగన్ తప్పులను ప్రజల్లో పెడుతున్నారు .. ఇదే సమయంలో ఆయా శాఖల వారీగా ప్రక్షాళన మొదలుపెడుతుంది.. తాజాగా ఎక్సైజ్ శాఖపై సమీక్ష జరిపిన చంద్రబాబు గత ఐదేళ్ళు పాలన జరిపిన జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.. జగన్ పాలన సమయంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు జరిపిస్తామని సీఎం చంద్రబాబు నాయడు మరోసారి స్పష్టం చేశారు.. ఇప్పటికే ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరిపిస్తామని శ్వేత పత్రం విడుదల చేసిన సమయంలో అసెంబ్లీ వేదికగా ప్రకటించిన చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకున్నకారణంగా గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు… ఏపీ లో జగన్ ఉన్నపుడు మద్యం పేరుతో దోపిడీ చేసారు .. అది ప్రజల ప్రాణాలనే తీసింది …ఆ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ..
మద్యం విధానంతో భారీ అక్రమాలు జరిగాయని .. అధికారులు పూర్తిగా సహకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జగన్ పాలనలో ఊహించని స్థాయిలో 5 ఏళ్లలో మద్యంలో అక్రమాలు జరిగాయని దీనిపై అన్ని లావాదేవీలు సీఐడీకి అందించాలన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామని చెప్పి, చెయ్యకుండా నాసిరకం మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని మండిపడ్డారు. నాణ్యత లేని మద్యం ఏపీలో ఉండకూడదు ప్రజల ప్రాణాలు తీసే నాసిరకం మద్యం ఇక రాష్ట్రంలో కనిపించటానికి వీలు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లు నాణ్యత లేని మద్యం ఏపీలో లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం చంద్రబాబు .. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. మద్యం సేవించేవారితో మాన్పించడం సాధ్యం కాకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే నాణ్యత లేని నాసిరకం మద్యం లేకుండా చేస్తే మంచిదన్నారు.