గత కొన్ని రోజుల నుంచి హార్దిక్ , నటాషా విడాకుల
వ్యవహారం హల్చల్ అవుతుంది .. ఇద్దరు తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి కొట్టి జీవితాన్ని సాగించాలని నిర్ణయించుకుపని … డివోర్స్ తీసుకున్నారు … ప్రేమ వివాహం చేసుకొని కూడా విడాకుల దారి పట్టారని నెటిజన్స్ కామెంట్స్ వినిపిస్తున్నాయి ..
రెండు రోజుల క్రితం ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో వెల్లడించారు. ఇది వారికి చాలా కఠినమైన నిర్ణయమని…. మేమిద్దరం విడిపోయినప్పటికీ మా మూడేళ్ల కుమారుడు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా మేము స్వీకరిస్తామని చెప్పాడు. నాలుగేళ్లు ఇద్దరం కలిసి ఉన్న తర్వాత విడిపోవాలని ఇద్దరం నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కలిసి ఉండాలని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు…
హార్దిక్ ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు అంటూ ట్రోల్ల్స్ వస్తున్నాయి … నటాషా పై తప్పుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు … ఒకరికి విడాకులు ఇచ్చి వెంటనే వేరొకరితో కనిపించింది అంటూ వాపోతుంటాడు … ఆ మధ్య నటాషా తన కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ కొన్ని వీడియోస్ కూడా వైరల్ అయ్యవీ …
అయితే హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోవడానికి ఓ అమ్మాయి ప్రధాన కారణమని రూమర్స్ వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా సోలంకి అనే యువతితో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి…. అందుకే
భార్య కి విడాకులు ఇచ్చాడని టాక్ … ఇద్దరు ఎవరికీ వారే మరొకరితో ఉంటున్నట్లు ఫొటోస్ వైరల్ అయ్యవీ … అంతేకాకుండా ఆ అమ్మాయితో చాలా క్లోజ్ గా ఫోటోలు దిగాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక వీరిద్దరూ వివాహం చేసుకుంటారంటూ మొన్నటి వరకు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి… అయితే కొన్ని రోజుల నుంచి హార్దిక్ పాండ్యాకు టైం అసలు బాగుండడం లేదు. ముంబై ఇండియన్స్ జట్టుకు కొత్తగా కెప్టెన్ గా…. అలాగే ప్లేయర్ గా అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించి టీమిండియాకు వరల్డ్ కప్ ను తీసుకువచ్చాడు. అయితే టీమిండియాకు కప్పు తీసుకువచ్చిన సంతోషంలో ఉన్న పాండ్యాకు మరో దెబ్బ తగిలింది.
అయితే రీసెంట్ గా పాండ్యా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహానికి హాజరయ్యాడు. ఈ వివాహ వేడుకలో నటి అనన్య పాండేతో డ్యాన్సులు చేశాడు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనేక రకాలుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ రూమర్స్ సోషల్ మీడియాలో చాలా రకాలుగా వైరల్ అవుతున్నాయి…