మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకుఎల్తుంది … వరసపెట్టి పెద్ద స్టార్స్ పక్కన అవకాశాలు దక్కించుకుంటుంది ..మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది … అప్పటి నుండి తిరుగులేకుండా కక్రేజీ ఆఫర్స్ తన సొంతం చేసుకున్నది ఈ చిన్నది … అతికొద్ది టైం లోనే బాగానే ఫ్యాన్ ఫాలోవింగ్ సొంతం చేసుకున్నది .. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత తనికి వరుస సినిమాల అవకాశాలు వస్తున్నాయి.. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలతోనే కాకుండా కోలివుడ్ స్టార్ హీరోల సరసన నటిస్తోంది. రెండు భాషల్లోనూ దాదాపుగా ఐదారు సినిమాలకి పైగానే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ భామ. మెగాస్టార్ హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే ఈ తాజాగా ఈ బ్యూటీ మరో లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ ఇచ్చినట్లుగా సమాచారం ..
ఒక కోలీవుడ్ సినిమా లో ఈమె నటించే అద్భుతమైన అవకాశాన్ని అందుకున్నట్లుగా సమాచారం. మెయిన్ లీడ్ లో టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ను ఎంపిక చేసినట్లుగా సమాచారం వినబడుతోంది.. . ఇదొక హారర్ కామెడీ నేపథ్యంతో కూడిన చిత్రమని తెలుస్తోంది.
మీనాక్షి చౌదరి కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి ఛాన్స్ అందుకోవడం విశేషం. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు ప్రమోట్ అవ్వాలంటే? చాలా సినిమాల్లో పనిచేసి ఉండాలి… స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేసిన అనుభవం అవసరం. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద సోలోగా సత్తా చాటగలగాలి. అయితే ప్రస్తుతం ఈ భామ తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది..అదృష్టం అంటే తనదే అని చెప్పాలి … పెద్ద పెద్ద హీరోయిన్స్ కె ఇలాంటి ఛాన్స్ దక్కలేదు … తాను మాత్రం వరుసగా సినిమాలు సైన్ చేస్తూ బిజీ గా ఉన్నది .. సో చూడాలి ఈ అమ్మడికి ఆ సినిమాలు విజయాన్ని అందిస్తాయో లేదో