గత కొద్దీ రోజులుగా రాజ్ తరుణ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది …
లావణ్య అనే యువతీ పోలీస్ మెట్టెక్కి రాజ్ తరుణ్ తనని మోసం చేసాడని కేసు పెట్టిన దగగ్ర నుండి ఇప్పటి వరకు ఆ కేసు లో రోజు రోజుకి కొత్త లీక్స్ బయటకి వస్తున్నాయి .. అయితే టాలీవుడ్ కూడా షాక్ అయింది .. హీరో రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారం … కేసుల వరకు వెళ్లడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది .. లావణ్య ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదు చేశారు..ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది .. లావణ్య ఆరోపణలు చేసిన మాల్వి .. రాజ్ తనకు కేవలం సినిమా లో సహా నటుడు , ఫ్రెండ్ మాత్రమే ..అంతకు మించి ఏమి లేదని చెప్పింది .. అయితే వీళ్లిద్దరి మధ్య ఎంతో ఉందని తాజాగా బయటకు వచ్చిన నిజాలు చూస్తే అర్ధం అవుతుంది . వీళ్లద్దరి మధ్య చాటింగ్‌లో.. వారి పర్సనల్ విషయాలు అన్ని బయటపడ్డాయి. వారిద్దరూ ఏ హోటల్ రూమ్స్‌లో కలుసుకున్నారు అనే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
2023లో రాజ్ తరుణ్.. మాల్వీ మల్హోత్రాకు ప్రపోజ్ చేశాడు. దానికి మాల్వి యాక్సెప్ట్ చేసినట్టు మెసేజ్ పెట్టింది.. అనేకసార్లు రాజ్ తరుణ్కుస్వయంగా మాల్వీనే హోటల్స్ బుక్ చేసింది. ఇన్నాళ్లు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్ తరుణ్ చెబుతూ రావడంతో .. ఇప్పుడిలా వారి మధ్య జరిగిన చాట్స్ లీక్ కావడం సంచలనంగా మారింది. ఇద్దరూ వీడియో కాల్స్, చాటింగ్స్ చేసుకున్నారు. తాజాగా బయటకొచ్చిన చాటింగ్స్ ఫొటోల్లో గంజాయి కూడా కనిపించడం సంచలనంగా మారింది. పర్సనల్ వ్యవహారాలపైన కూడా ఇద్దరూ చాట్ చేసుకున్నారు.. ఇద్దరి మధ్య చాల జరిగాయి … అలాగే శారీరక సంబంధం కూడా ఉందని లావణ్య చెప్పింది … ఇదంతా చుస్తే ఇద్దరి మధ్య ఎప్పటి నుండి ఆ సంబంధం కూడా ఉందని తేలిపోయింది …
వీరు కోయంబత్తూర్ మాధవ హోటల్లో కలిసేవారు. వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉండేవారు. రోజువారీ ప్లానింగ్స్, ట్రిప్స్, ఔట్స్ ప్రతిదీ కూడా షేర్ చేసుకునేవారని వాళ్ళ చాట్‌ని బట్టి స్పష్టమవుతోంది.
ఇవన్నీ చూస్తే .రాజ్ తరుణ్ పై లావణ్య ఆరోపణలు నిజమే అని భావించవలసి వస్తుంది . రాజ్ తరుణ్‌తో మాల్వీ మల్హోత్రా ఇల్లీగల్ రిలేషన్ అంటూ నర్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అది నిజమేనేమో తెలుస్తుంది . ఇప్పటికే ఈ విషయంలో పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురయ్యాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పటికే ముగ్గురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు మాల్యా , రాజ్ తరుణ్ చాటింగ్స్ బయటకు రావడంతో ..లావణ్య కేసుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కీలకంగా మారింది ..అయితే పోలీసుల ముందు హాజరుకావాల్సిన రాజ్ తరుణ్ ..తాను అందుబాటులో లేనని ..లాయర్ ద్వారా తెలిపాడు .. ఇప్పుడు తాజా వ్యవహారంతో తప్పనిసరిగా హాజరుకావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ..
ఈ డేటా తో ఇద్దరికీ కెరియర్ ప్రాబ్లమ్ లో పడింది .. ఎంత జరిగిన
ఆధారాలతో సహా కనిపిస్తున్న
రాజ్ తరుణ్ ఎలా కప్పిపుచ్చుతాడో చూడాలి ..