తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఫోకస్ చేసారు .. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్త అని మాట ఇచ్చారు … అదే విధంగా రుణమాఫీ చేసి మరోసారి ప్రజల మనసులు గెలుసుకున్న సీఎం రేవంత్ అని చెప్పాలి … తొలి దశలో లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణ విముక్తి చేశారు కాంగ్రెస్ సర్కార్..
ఇందుకోసం సుమారు 6 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసారు . ఏదో విధంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్న సర్కారు… రుణ మాఫీతో అన్నదాతల్లో ఆశలు నింపింది…
రైతు కళ్ళలో ఆనందం చూసింది … ఇక మిగిలిన 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు మరో 25 వేల కోట్ల రూపాయలు అవసరముంది … వాటికోసమే సీఎం రేవంత్ గడువు తీసుకున్నారు అని టాక్ వినిపిస్తుంది .. ప్రస్తుతం నిధులు లేవు కాబట్టి రుణమాఫీకి కావాల్సిన డబ్బు సమకూర్చే పనిలో ఉన్నారు .. దీని కోసం
ముమ్మరంగా ప్రయత్నిస్తోంది .
ఏకకాలంలో 31 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం… నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియను ప్రారంభించడంతో హర్షం వ్యక్తమవుతోంది. రుణమాఫీ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం… అవేవీ కొలిక్కి రాకపోయినా అందుబాటులో ఉన్న నిధులతో తొలి విడతలో 11 లక్షల మందికి లబ్ధి చేకూర్చి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ చెప్పింది. ఐతే ఇప్పుడు మిగిలిన రైతుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది… రైతు రుణమాఫీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు రకరకాల మార్గాలను అన్వేషించింది. .
ఆ అన్వేషినలో భాగంగా హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను విక్రయించడంతోపాటు ఈఎంఐ పద్ధతిలో రుణాలు తీసుకోవడం, బకాయిలను వసూలు చేయడం, కేంద్రం నుంచి అదనపు నిధులు సేకరించడం వంటి రకరకరాల ప్రయత్నాలు చేస్తోంది.
ఐతే ఇప్పుడు కేంద్రం నిధులు, అదనపు రుణాలు వస్తే కాని మిగిలిన రైతులకు రుణమాఫీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు.
కానీ, ప్రభుత్వం మిగిలిన రైతులకు రుణమాఫీ చేసేలా అవసరమైన ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసిందనే అంటున్నారు. వచ్చే నెల తొలి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్నందున ఆలోగానే మొత్తం రైతు రుణమాఫీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. కాకపోతే.. మిగిలిన పథకాలకు నిధులు సర్దుబాటు చేయడమే ప్రభుత్వానికి ఇప్పుడు సవాల్‌గా మారింది.ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలపై హామీలిచ్చింది. ఇందులో రెండు పథకాలు ఇప్పటికే అమలు అవుతున్నాయి. రైతు రుణమాఫీ కూడా అమలులోకి వచ్చింది. ఇక మిగిలిన గ్యారెంటీలతోపాటు ఇతర ఎన్నికల హామీలు, ఇప్పటికే అమలు అవుతున్న పథకాలకు నిధులు ఎలా సమీకరిస్తారనేదే ఎవరికీ అంతుచిక్కడం లేదు. కానీ, ప్రభుత్వం దశలవారీగా అన్ని పథకాలను అమలు చేస్తామనే చెబుతోంది…
ఇదే సమయంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి కూడా ఎక్కువైంది. తొలి ఆరు నెలలు కొత్త ప్రభుత్వానికి అవకాశమివ్వాలని ప్రతిపక్షాలు వేచిచూశాయి.కానీ ఇప్పుడూ ప్రభుత్వంపై బిఆర్ఎస్ , బీజేపీ పోరాటాలు ప్రారంభించాయి… దీంతో మున్ముందు రేవంత్ రెడ్డి ఎలా వాళ్ళతో పోరాటానికి దిగి ఇచ్చిన హామీలో నెగ్గుతారు చూడాలి … అదేవిధంగా
రేవంత్‌రెడ్డి ఎలా అడుగులు వేస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.