Home Telugu యడ్యూరప్ప పై అరెస్ట్ వారెంట్ జారీ

యడ్యూరప్ప పై అరెస్ట్ వారెంట్ జారీ

by malakapalli
0 comment
Yedyurappa

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిజెపి నేత బిఎస్ యడ్యూరప్ప పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గతంలో ఒక బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించింది. అయితే గురువారం నాడు బెంగళూరు కోర్టు ఆయనపై నాన్ బాయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనే త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ కేసులో ఇప్పటికే సిఐడి అధికారులు ఆయనకు సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న మీ ముందుకు హాజరు కాగలను అని ఆయన సిఐడికి తెలియ చేశారు.

బాధితురాలు తల్లి ఇటీవలే ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారు. అయితే అంతకంటే ముందే బాధితురాలు మరియు ఆమె తల్లి యొక్క వాంగ్మూలాలను సిఐడి రికార్డు చేసినట్లు కేసు నమోదు చేసిన తర్వాత యడ్యూరప్ప వాయిస్ శాంపిల్ కూడా అధికారుల సేకరించారని తెలిపారు. కాగా ఈ ఆరోపణను యడ్యూరప్ప ఖండించారు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved