కొన్ని టెంపుల్స్ చరిత్ర మనం ఎంత తెల్సుకున్న కొత్తగా ఏదోకటి తెల్సుకోవాల్సినది ఉంటుంది … కొన్ని దేవాలయాల మిస్టరీస్ ఇప్పటికి అలానే ఉన్నాయి అందులో పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం అనే చెప్పాలి … దీనిపై గతకొన్ని రోజులుగా దేశంలోని ప్రజల దృష్టంతా పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారంపైనే నెలకొని ఉంది .. ఈ రహస్య గది తలుపులు ఎప్పుడు తెరుచుకోనుంటాయా అని దేశం మొత్తం ఎదురుచూసింది …
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారాన్ని ఇప్పటికే ఒకసారి తెరవగా .. తాజాగా నేడు మరోసారి తెరిచారు. ఆ రహస్య గదిలో ఏముంది … అనేది ఇంకా తెలియలేదు …
రహస్య గదిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించనున్నారు. ఆ గదిని తెరుస్తున్న కారణంగా భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. 46 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపునకు శ్రీకారం చుట్టడంతో గత ఆదివారం తర్వాత నేడు మరోసారి రత్న భాండాగారం తెరుచుకుంది. నిర్ణయించిన శుభముహూర్తం ప్రకారం 9.51 నుంచి 12.15 గంటల మధ్య గదిని తరచారు . పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదుల్లో ఏం ఉందో తెలుసుకోవడానికి దేశం మొత్తం కూడ ఆసక్తి చూపిస్తోంది. శ్రీక్షేత్ర కార్యాలయంలో భాండాగారం అధ్యయన సంఘం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి రహస్య గది తలుపులు తెరవడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపదను బయటకు తీసి స్ట్రాంగ్‌రూంకు పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టి తరలించారు.
అయితే తాజాగా రత్న భాండాగారంలోని మరిన్ని గదులను తెరచారు. అందులోని సంపదను, విలువైన వస్తువులను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలో భద్రపరచనున్నారు. అనంతరం ఈ భాండాగారానికి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు నిర్వహించనున్నారు. పనులు పూర్తి అయిన తర్వాత మొత్తం సంపదను మరలా భాండాగారానిరి తరలించి లెక్కించనున్నారు. రహస్య గది తెరుస్తున్న కారణంగా శ్రీక్షేత్రంలో బందోబస్తు ఏర్పాటు చేశారు .. సంపద లెక్కింపుకు మరికొన్ని రోజులు సమయం పెట్టె అవకాశం వుంది..
దానికి కొంత టైం పడుతుందని … అసలు ఆ తెరిచినా గదుల్లో ఏముంది అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు … త్వరలోనే ఆ విషయాలు వెల్లడిస్తారు .. దీనిపై సాంస్కోభం బయటపడుతుంది …