ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల హీట్ పెరిగింది .. జగన్
కల్లోలం మళ్లీ మొదలయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది…మాజీ సీఎం జగన్ అధికారం మదంతో పథకాలు ఇచ్చి .. ప్రజల్ని బాగానే వాడుకున్నారు .. ఏపీ ని అభివృద్ధి చేసిందేమి లేదు కానీ.. అప్పులు తెచ్చి పథకాలు ఇచ్చి .. మళ్ళీ ప్రజల దగ్గరే సొమ్ములు వసూల్ చేసేవారు .. ఇంకొకటి కల్తీ మందు అమ్మి ప్రజల గొంతు కొసారు .. ఇదిలా ఉంటె వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో గత వారం రోజుల్లో రెండుసార్లు సమావేశం అయ్యారు … దాని వెనుక జగన్ పై ఉన్న కేసులు .. మరొకటి తనపై నడుస్తున్న ఇష్యూ రెండు కారణాలుగా చూపుతున్నారు … అసలు వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు అమిత్ షా తో బేటి అయ్యి .. ఆ ఫోటోలను గొప్పగా రిలీజ్ చేసుకున్నారు… దానికి అర్ధం ఏమి అయ్యి ఉంటుందా అని తలలు బాదుకుంటున్నారు .. ఈ పరిస్థితుల్లో ఆయనకు అమిత్ షా తో ఫోటోలు దిగటం చాలా అవసరం అని చెప్పాలి. అయితే అమిత్ షా ఎందుకు ? ఆ ఛాన్స్ ఇస్తున్నారు అన్నది ఢిల్లీలో ఆసక్తికర చర్చలకు కారణం అవుతుంది. వైసిపి రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి టిడిపిలో చేరి మళ్ళీ ఆ పార్టీ తరపున గెలుస్తారని సాక్షి మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి అది వైసిపి కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారం అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ తనను తాను రక్షించుకునేందుకు సరికొత్త గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తోంది…
రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడానికి జగన్ హస్తం ఉందని అంటున్నారు ..ఆరుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు బిజెపిలో చేరటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని … అందుకే విజయ్ సాయి రెడ్డి అమిత్ షాను వారం రోజుల వ్యవధి లోనే రెండుసార్లు కలిశారని అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎంపీలకు బదులుగా జగన్ కొన్ని రాజకీయ ప్రయోజనాలు కూడా కోరుకుంటున్నారని టాక్ ? అందులో మొదటిది తన కేసులతో పాటు వివేక హత్య కేసు స్టేట స్ కో ఉండేలా చూడాలని అంటున్నారు.. అయితే దీనిపై బిజెపి స్పందన ఏమిటన్నది ? తెలియజేయలేదు.