ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం రాజ్ తరుణ్ , లావణ్య టాపిక్ హైలెట్ అవుతుంది … అందరి చూపు దానివైపే ఉంది … లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని ..తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది… అయితే ఈ కేసు లో మరికొందరి పేర్లు కూడా బయటకి వచ్చాయి … పేరున్న హీరోయిన్స్ అలాగే యాంకర్ అరియనా తో కూడా రాజ్ కి సంబంధం ఉందని మీడియా ముందు లావణ్య చెప్పుకొచ్చింది … అయినాగానీ రాజ్ తరుణ్ కావాలని లావణ్య స్పష్టం చేసింది.
లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్‌తో ఉన్న మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు.. కష్టపడి ఈ స్థాయికి వచ్చానని.. ఆమె ప్రతి విషయానికి బెదిరించేదని.. అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు…లావణ్య కు డ్రగ్స్ అలవాటు ఉందని … అలాగే వేరే అతనితో కలిసి ఉంటున్నాడని ఇవన్నీ నచ్చకనే లావణ్యకి దూరంగా ఉంటున్నాను అని వెల్లడించారు ..
దీనిలో భాగంగానే రాజ్ తరుణ్ కు నాకు పెళ్లయినట్లు ఇండస్ట్రీ లో చాలా మందికి తెల్సు అని చెప్పుకొచ్చింది .. తాజాగా మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తాను పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్‌నని, ఆయన సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి షో చూస్తానని.. అలాగే నా కారు వెనుక పవన్ కళ్యాణ్ స్టిక్కర్ తప్పనిసరిగా ఉంటుందని చెప్పుకొచ్చింది. అందుకే న్యాయం కోసం నేను ఆయన వద్దకే వెళ్తానని లావణ్య తెలిపింది… చూడాలి ఈ కేసు లో లావణ్య పవన్ కళ్యాణ్ ను సంప్రదిస్తుందా లేదా అనేది … పవన్ కళ్యాణ్ ఏ విధంగా న్యాయం చేస్తారో వెయిట్ చేద్దాం ..!