రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అబానీ ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్ లో.. ఆసియాలో నంబర్ వన పొజిషన్ లో ఉన్నారు వ్యాపారరంగంలో తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ముకేశ్ అంబానీ ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభంగా జరిపించారు. దాదాపు ఆరు నెలలపాటు ఈ పెళ్లి వేడుక సాగింది. సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఇందుకోసం ఖర్చు చేశారు. భారత దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయనంత గొప్పగా పెళ్లి జరిపించారు. ఇక అంబానీ ఇంట కోడలిగా రాధిక మర్చంట్ అడుగుపెట్టింది. అయితే ఈ రాధిక మర్చంట్ ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. రాధిక మర్చంట్ ఎవరి కూతురు..? ముకేశ్ అంబానీ వియ్యంకుడు ఎవరు..? ఆయన నేపథ్యం ఏంటి..? పెళ్లి సంబంధం ఎలా కుదిరింది..? అసలు రాధిక ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అపర కుబేరుడి ఇంటికి కోడలిగా వచ్చిన రాధిక మచ్చంట్ ఎంకోర్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు, యజమానులుగా ఉన్న వీరేన్ మర్చంట్ – శైలా మర్చంట్ దంపతుల చిన్న కుమార్తె. రాధిక తండ్రి ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈవో, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, స్టీల్ తయారీ సంస్థ బోర్డు సభ్యుడు, శైలా మర్చంట్ ఎన్ కోర్ హెల్త్ కేర్ డైరెక్టర్ గా ఉన్నారు. వీరేన్ మర్చంట్ కు ఇద్దరు అమ్మాయి కాగా.. పెద్దమ్మాయి అంజలి, చిన్న కుమార్తె రాధిక మర్చంట్. ఇక రాధిక మర్చంట్ అక్క అంజలి మర్చంట్ తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలో కీలకపాత్రలు పోషిస్తుంది. తండ్రి విరేన్ మర్చంట్ ఫార్మా కంపెనీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈహెచ్‌ఎల్‌పీ కంపెనీలో మొదట్లో జనరల్ మేనేజర్ – బిజినెస్ డెవలప్‌మెంట్‌గా చేరి, తర్వాత మేనేజర్ – మార్కెటింగ్, క్లయింట్ ఔట్రీచ్ ఎగ్జిక్యూటివ్ గా రాణించారు. 2021లో ఈహెచ్‌ఎల్‌పీ అభివృద్ది, విస్తరణ స్ట్రీరింగ్ చేయడంలో ఆమె ఆలోచనలతో సుస్థిరం చేయగా.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగంలోకి అడుగుపెట్టింది. మైలూన్ మెటల్స్ స్థాపించి అలియా భట్, టబు వంటి ప్రముఖులచే ప్రోత్సహించబడిన హెయిర్ స్టైలింగ్, ట్రీట్మెంట్ క్లబ్ సీఈఓగా గుర్తింపు పొందింది. ముంబైలోని ది కేథడ్రల్, జాన్ కానన్స్కూల్, ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.
ఆ తర్వాత విదేశాలలో ఉన్న విద్యను అభ్యసించింది. అంజలి మసాచుసెట్స్‌లోని బాబ్సన్ కాలేజీ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్డిగ్రీ పట్టా పొందింది. లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. విద్యావిషయక కార్యక్రమాలలో ట్రాన్స్ఫార్మేటివ్ సెమిస్టర్ ఎట్ సీ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. 12 దేశాలలో విభిన్న సంస్కృతుల గురించి అధ్యానయం చేసింది. ఈ అనుభవం గ్లోబల్ ఎకనామిక్స్, లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ స్టడీస్‌పై ఆమె అవగాహనను సుసంపన్నం చేసింది. 2020లో ప్రముఖ వ్యాపారవేత్త అమన్ మజిథియాను వివాహం చేసుకుంది అంజలి. వీరికి ఒక బాబు ఉన్నాడు. అమన్ మజిథియా ఈహెచ్‌ఎల్‌పీ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే కంపెనీలోని సీఎంవో యూనిట్ కార్యాచరణ అంశాలను చూసుకుంటారు. అంజలి నికర విలువ సుమారు 2 వేల కోట్ల రూపాయాలకు పైగానే ఉంటుంది. ఇక అంబానీ ఇంటి కోడలైన రాధిక మర్చంట్ 1994 డిసెంబర్ 18 ముంబైలో జన్మించింది. తన పాఠశాల విద్యను కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్లో చదివారు. రాధిక బీడీ సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా కూడా పొందారు.
న్యూయార్క్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ చేశారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాధిక మర్చంట్ ఇస్ప్రవా అనే లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరారు. ఒక సంవత్సరం పనిచేశారు. తర్వాత ఆమె ఎన్కోర్ హెల్త్‌కేర్ కు వెళ్లింది. రాధిక భరతనాట్యంలో శిక్షణ కూడా పొందింది. 2022 జూన్ లో రాధిక మర్చంట్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో తన మొదటి దశ ప్రదర్శన ప్రదర్శించారు. ఇదిలా ఉంటే రాధిక మర్చంట్, అనంత్ అంబానీ చిన్ననాటి స్నేహితులు. అంబానీ నివాసానికి రాధిక తరచుగా అతిథిగా వచ్చేది. అంబానీ ఇంట ఏ చిన్ని ఫంక్షన్ జరిగిన రాధిక ఉండేది. అయితే అప్పటికే అనంత్ అంబాని రాధికను లవ్ చేయ్యడం స్టార్ట్ చేశారు. టెన్త్ నుంచి రాధికను ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నీతా – ముకేశ్ లు.. రాధిక తండ్రితో చెప్పారు. ఆయన కూడా తన కూతురికి ఇష్టమైతే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో నీతా అంబాని రాధికను కలిసి అనంత్ ప్రేమ గురించి చెప్పింది. రాధికా కూడా ఒకే చెప్పడంతో.. అప్పుటి నుంచి రాధిక అనంత్ లు డేట్ చేయ్యడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2018లో ఆనంద్ పిరమల్ తో ఇషా అంబానీ వివాహానికి, 2019లో ఆకాశ్–శ్లోకా వివాహానికి కూడా రాధిక హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆ తర్వాత 2023 డిసెంబర్ లో జరిగిన నిశ్చితార్ధం అనంత్ -రాధిక నిశ్చితార్ధం జరిగింది. 2024 జూలై 12 న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇలా రాధిక మర్చంట్ కాస్త.. రాధిక అంబానీగా మారిపోయారు.