తెలంగాణాలో రియల్ ఎస్టేట్ సచ్చిపోతుందా అంటే అవుననే ఆ రంగం నిపుణులు అంటున్నారు .. వరుస ఎన్నికలు , ధరణి లోపాలు , కొత్త సంస్థలు రాకపోవడం .. కొత్త రిఫార్మ్స్ లేకపోవడం ..111 జీవో పై క్లారిటీ లేకపోవడం .. ఇలా ఎన్నో కారణాల వలన రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొని ఉంది .. వాటన్నింటి ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ రంగంపై పడింది … అలాగే ఆర్థిక మందగమనం ఇలా పలు అంశాలు రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి .. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి క్రయవిక్రయాలు భారీగా పడిపోయాయి అనే చెప్పాలి .. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత .. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు, నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత ఇంకా ఇవ్వకపోవడంతో .. రియల్ ఎస్టేట్ పరిశ్రమ కొంత నిరాశలోకి వెళ్ళిపోయింది .. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు..
సాధారణంగా నే ఎన్నికల ముందు .. తర్వాత స్థిరాస్తి మార్కెట్ కొంత తగ్గుతూ ఉంటుంది. నగదు పై ఫోకస్ ఉండటం , అలాగే లావాదేవీలపై ఉన్న పరిమితులు రియల్ ఎస్టేట్ రంగంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది అయినప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన విధానాలు, పాలసీల అమలుపై స్పష్టత లేదని ఆ రంగం వారు అంటున్నారు . దానిపై కొందరు సీఎం పై మండిపడుతున్నారు ..
ఔటర్ వరకూ గ్రేటర్ విస్తరణ, మెగా మాస్టర్ ప్లాన్, , మెట్రో విస్తరణ, ముందే చెప్పినట్టు 111 జీవో రద్దు వంటి పలు ప్రాజెక్టుల పరిస్థితి పై స్పష్టత లేకపోవడం ఈ రంగంపై ప్రభావం చూపుతుంది .. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతోపాటు ఐటీ రంగంలో లేఆఫ్‌లు కూడా జరుగుతున్నాయి. . ఇది కూడా రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుంది .. మరోవైపు సిమెంట్, స్టీలు ఇతర నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయి . దీంతో అపార్ట్మెంట్ల ధరలు పెరిగాయి . దీనితో సామాన్య, మధ్యతరగతి ప్రజల కొనలేని స్థితి నెలకొని ఉంది .. ఇది కూడా ఈ రంగంపై ప్రభావం చూపుతుంది . ఇదే సమయంలో ఏపీలో బాబు గెలుపు కూడా ఇక్కడ కొంత ప్రభావం చూపుతుంది ..బాబు పై నమ్మకంతో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి చొరవ చూపుతున్నారు .. హైదరాబాద్ లో అమ్మడం .. అమరావతిలో కొనడం వంటివి మొదలవుతున్నాయి .. ఆంధ్ర బిజినెస్ పరసన్స్ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు .. అందువలన తెలంగాణ రియల్ ఎస్టేట్ కొంత మందగించింది ..
ఇదే సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు కూడా కొంత ప్రతికూలంగా మారింది . అలాగే హైదరాబాద్ లో అభివృద్ధి పనులు ఇంకా స్పీడ్ అందుకోకపోవడం .. రోడ్ల అభివృద్ధి పై ఇంకా స్పష్టత లేకపోవడం .. బెంగళూరు హై వే విస్తరణ పై ఇంకా క్లారిటీ లేకపోవడం .. ఇదే సమయంలో రేవంత్ పార్టీలో సమస్యలపైనే ఇంకా ఫోకస్ పెట్టడం .. అభివ్రుది పై పూర్తి స్థాయిలో ఫోకస్ లేకపోవడం ..పార్టీని , ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడం కోసం జాయినింగ్స్ ప్రోత్సహించడం .. వాటి వలన ఉత్పన్నమైన సమస్యలపై ద్రుష్టి పెట్టడం ..దీనికి తోడు పిసీస్ చీఫ్ గా అదనపు బాధ్యతల వలన పార్టీ స్థాయిలో పాలనపై ఫోకస్ పెట్టలేకపోవడం కూడా రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుంది ..
ఇప్పటికైనా సీఎం
అభివృద్ధిపై ఫోకస్ పెడితేనే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడానికి అవకాశాలు ఉంటాయి ..త్వరగా ఈ విషయంలో సీఎం కాస్త చురుగ్గా నిర్ణయం తీసుకుంటాని ఆశిద్దాం ..