ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ పేదలకి నేరుగా లబ్ది చేకూర్చిన ఘోరంగా ఓడిపోయారు ..అందుకు తాను చేసిన పనులే కారణమని ఏపీ ప్రజలు అభిప్రాయం .. అయితే జగన్ ఓటమిపై తెలంగాణ నేతలు సైతం ఆశ్చర్య పోతున్నారు ..అయితే జగన్ ఓటమికి కారణాల్లో ప్రజలకి దూరమవడం కూడా ఒకటని చెబుతారు .. ఐదేళ్ల పాలన కాలంలో ప్రజలను నేరుగా కలిసేందుకు అయన సమయం కేటాయించలేదు. జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోనే ఎక్కువగా ఉండిపోయారు. ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలను నిర్వహించ లేదు. దీంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా జగన్ అపాయింట్ మెంట్ లభించేది కాదన్న విమర్శలు ఉన్నాయి … అయితే ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి పరిస్థితి రానివ్వకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది . చంద్రబాబు ముఖ్యమంత్రిగా వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నందున.. ఆ బాధ్యతను మంత్రి నారా లోకేష్ చేపట్టారు.
ప్రతి రోజూ తన నివాసంలో ప్రజాదర్బార్ ను నిర్వహిస్తున్నారు. అక్కడకి వచ్చిన వారు వ్యక్తిగత సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకు వస్తుండటంతో ఆయన వెంటనే పరిష్కరించాలని పంపుతున్నారు. అనేక సమస్యలతో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని వాటిని కూడా లోకేష్ వెంటనే సాల్వ్ చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. .. ఉదయం ఆరు గంటల నుంచి గంట పాటు లోకేష్ నేరుగా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ఏడు గంటల తర్వాత వచ్చిన వారికి అనుమతి లేదని ముందుగానే చెబుతుండటంతో .. చాలామంది రాత్రికే విజయవాడకు చేరుకుని ఉదయం ఆరు గంటలలోపే ఆయన నివాసానికి చేరుకుంటున్నారు . పిటీషన్లు తాము లోకేష్ కు ఇస్తే వెంటనే పరిష్కారం అవుతుండటంతో ప్రజా దర్బార్ కు మంచి స్పందన లభిస్తుందని చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో ఇబ్బందులు, సమస్యలను చెప్పుకోవడానికి లోకేష్ వద్దకు క్యూ కడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిధులు విడుదల చేసేందుకు సంబంధిత మంత్రులకు తెలియజేయాలని లోకేష్ ని ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. దీంతో చంద్రబాబును కలవకపోయినా లోకేష్ అందుబాటులో ఉండటంతో ఎమ్మెల్యేలు తమ బాధలను చెప్పుకునే వీలుకల్పిస్తూ లోకేష్ ప్రతి రోజూ ఎమ్మెల్యేల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు లోకేష్ అంతా తానే అయి వ్యవహరిస్తున్నట్టు స్పష్టం అవుతుంది ..