తెలంగాణ లోని అధికారపార్టీ కాంగ్రెస్ లో కీలక పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి.. ఒకప్పుడు సీనియర్ లీడర్ల మధ్యే సమన్వయం లేదనే ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల ముందు తామంతా ఒకటే అని సీఎం రేవంత్ రెడ్డితో సహ ప్రజల ముందు చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా గెలుపుకోసం మాత్రమే అని ఇంకా నాయకుల సఖ్యత లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. దీనికి కొంతమంది నాయకులు ప్రతిపక్షలీడర్లకు కౌంటర్ ఇస్తున్నారు. తామంతా ఒకేటే అని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నడుస్తామని చెప్పకనే చెబుతున్నారు. ఇందుకు తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుది.. రేవంతే సీఎంగా ఉంటారని కొద్ది రోజుల కిందట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కోమటిరెడ్డిని కూడా రేవంత్ సీఎం మెటీరియల్ అని ప్రశంసించారు. అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రేవంత్ టర్మ్ ను పదేళ్ల నుంచి ఇరవై ఏళ్లకు పెంచారు. కాంగ్రెస్ ఇరవయ్యేఏళ్లు అధికారంలో ఉంటుందని ఇరవయ్యేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని ఆయన చెప్పుకొస్తున్నారు. తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించడం లేదని కోమటిరెడ్డి చెబుతున్నారు… ఇవే ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి ..
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంతా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని ప్రకటించారు.. అసెంబ్లీ స్థానాలు 175కు పెరిగే ఛాన్స్ ఉందని.. అందులో తాము 135 సీట్లు గెలుచుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జోస్యం చెప్పుకున్నారు.. బీఆర్ఎస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి, పొంగులేటిని టార్గెట్ చేసుకుంటున్నారు. వారిద్దరూ కలిసి రేవంత్ పై కుట్ర చేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో ఇటీవల కొంత మంది సీనియర్లు హైకమాండ్ వద్ద పలుకుబడి పెంచుకోవడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. రేవంత్ నిర్ణయాలకు పూర్తి స్థాయిలో అడ్డం పడుతున్నారు. అందుకే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ వంటి పదవుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయితే బయట మాత్రం .. ఆ విబేధాలు కనిపించకుండా చూసుకుంటున్నారని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు… కాంగ్రెస్ పార్టీ లో మొదటి నుండి కుమ్ములాట సహజమే .. అందుకే సీఎం రేవంత్ నిర్ణయాలకు అడ్డుకట్ట వేస్తున్నారు సీనియర్లు … దానిపై పెద్ద రచ్చే నడుస్తుంది అని చెప్పాలి …