బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హస్తం గూటికి తెచ్చే అంశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాం ఎవ్వరికి అర్థంకావడంలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్లాన్ లేకుండా ఎవరు వస్తే వారికి కండువా కప్పుతున్నారని అనుకుంటున్నారు. ఎందుకంటే రోజుకో ఎమ్మెల్యే చొప్పున వచ్చి పార్టీలో చేరుతున్నారు.. అయితే
బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే విషయంలో సీఎం రేవంత్ ప్రధానంగా కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు కానీ, మంత్రులు కానీ కనిపించడం లేదు. రేవంత్ మాత్రం బీఆర్ఎస్ నుండి 26 మందిని ఖచ్చితంగా చేర్చుకుంటాం అని కఠినంగా చెబుతున్నాడు… ఇదంతా కేసీఆర్ పై కోపం తో రేవంత్ రెడ్డి ప్లాన్స్ అని మరికొందరు కాంగ్రెస్ శ్రేణులు ఆనుతున్నారు … వాస్తవాలేంటో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ అధికారంలోకి వచ్చి
ఏడు నెలలు దాటిపోయింది. మధ్యలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పరిపాలనకు ఎన్నికల కోడ్ అడ్డుగా నిలిచింది. లోక్ సభ ఎన్నికలు ముగియగానే మంత్రి వర్గ విస్తరణ ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ గత ఏడాది డిసెంబరులో ప్రమాణ స్వీకారం చేసిన 12 మంది మంత్రులే కొనసాగుతున్నారు. ఆరు మంత్రి పదవులు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రేవంత్, పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా కొలిక్కి రాలేదు. దీనికి రేవంత్ ఇచ్చిన జాబితానే కారణం అని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనలకు భిన్నంగా రేవంత్ వెళ్తున్నాడన్న అనుమానాలు ఏఐసీసీలో మొదలయ్యవి …చంద్రబాబు ఆశీస్సులతో కాంగ్రెస్ అధిష్టానంతో ఎలాంటి సమస్యలు వచ్చినా సొంత కుంపటి పెట్టుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడని అంటున్నారు.ఇక్కడ రేవంత్ వ్యూహాత్మకంగా కొందరికి లబ్ది చేకూర్చేలా వ్యవహరించాడన్న అనుమానాలు ఏఐసీసీలో మొదలయ్యాయి.
అప్పుడే కాంగ్రెస్ అధిష్టానం తాను తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటుందని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. లేకపోతే ప్రతిసారి కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాలను అమలు చేయడానికే తన పాత్ర పరిమితం అవుతుందని, దానికి చెక్ పెట్టడమే చేరికల లక్ష్యం అని చెబుతున్నారు… దానిలో భాగంగా రేవంత్ రెడ్డి సొంత పెత్తనాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పెద్దల నుండి వినిపిస్తున్న వాదన … రేవంత్ కు ఈ విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అయింది ..