రాజకీయాల్లో ఎన్నికల సమయం లో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటరు .. దానిలో భాగంగా కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యవీ … కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి
బిఆర్ ఎస్ , బీజేపీ పై రెచ్చిపోయి కామెంట్స్ చేసింది … సీఎం రేవంత్ రెడ్డి ఈ తరుణంలో కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు అలాగే మోడీ ని కూడా విమర్శించారు … కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నకాని సీఎం రేవంత్ నోటికి అదుపు లేకుండా ధ్వజమెత్తారు ..బీఆర్ఎస్,బీజేపీ ఒక్కటే అని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేసింది. ఈ ప్రచారంతో ఇటు బీజేపీ, అటు అధికార బీఆర్ఎస్ కు తీవ్రంగా నష్టం జరిగింది… ఒక విధంగా చెప్పాలంటే బిఆర్ ఎస్ ఓటమికి అదొక కారణం అని చెప్పాలి … అలాగే బీజేపీ కి తక్కువ సీట్లు రావడనికి కూడా కాంగ్రెస్ చేసిన ఆ ప్రచారమే అని చెప్పాలి …
బీజేపీకి ఆశించిన సీట్లు రాకపోగా, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో లోక్సభ ఎన్నికల సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఇదే నినాదంతో ప్రచారం చేశారు.
కానీ, ఈ సారి బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరిగింది. బీజేపీపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా తెలంగాణ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని, రేవంత్రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీకి గెలుపుపై కొంత ప్రభావం చూపింది. బీజేపీకి కలిసి వచ్చింది. ఇదే సమయంలో బీఆర్ఎస్కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. మొత్తానికే నష్టపోయింది … పార్టీ లో ఉన్న నేతలు పక్కదారి పట్టారు … అయితే బీఆర్ఎస్ ప్రచారానికి ఓ కారణం ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీతో.. సీఎం రేవంత్ రెడ్డి వేదికను పంచుకున్నారు. వేదికపై నుంచి గుజరాత్ మోడల్ స్ఫూర్తిగా తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమయంలో రేవంత్ తన ప్రసంగంతో కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం గొడవలు పడి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు.
ఇక వేదికపై మోడీని పెద్దన్నగా ప్రకటించారు. దీంతో లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు. ఫలితంగా అధికార కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై సీఎం రేవంత్రెడ్డి నిరసన వ్యక్తం చేశారు… ఈ నేపథ్యంలో మోడీ పై సీఎం రేవంత్ మళ్ళీ విమర్శలు కురిపించారు ..
ఈ మేరకు అసెంబ్లీలో చర్చించారు. కేంద్రం తీరును సీఎం రేవంత్ తప్పు పట్టారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే ఖచ్చితంగా తెలంగాణ కోసం పోరాటం చేసేదని… కానీ కాంగ్రెస్ అలాగే బిజెపి పార్టీలో.. గెలవడం వల్ల బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని గులాబీ పార్టీ చెబుతోంది. అయితే కేంద్ర బడ్జెట్ పై.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ తరుణంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, హరీష్ రావుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ధర్నాలు చేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేయడంతో.. కాంగ్రెస్ కూడా సిద్ధమని తెలిపింది.ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఎప్పుడు మేమే దీక్షలు చేస్తున్నామని ఇప్పుడు రేవంత్ రెడ్డి.. దీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేస్తే నేను కూడా సిద్ధమని స్పష్టం చేశారు.