గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే దీనికి మొన్న లక్ష లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుంది … విడతలవారీగా మిగిలిన రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు ..
ఇప్పటికే తొలి విడతలో లక్ష రూపాయల వరకు మాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయడంతో వారి ముఖాల్లో అనందం కనిపిస్తుంది .. అయితే కొందరు రైతులు మాత్రం ఋణం మాఫీ కాకపోవడంతో ఆవేదమా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోని బ్యాంకుల్లో నిరర్థక ఖాతాలుగా నమోదైన రైతు ఖాతాలను పంట రుణాలమాఫీ పథకంనుంచి మినహాయించారు. మొదటి విడతగా లక్ష లోపు రుణమాఫీ జరిగిన జాబితాలో ఎన్పీఏ ఖాతాలున్న రైతుల పేర్లు తొలగించినట్లు తెలుస్తుంది . తమ పేర్లు రాలేదని బ్యాంకులకు వెళ్లిన రైతులకు.. బ్యాంకు అధికారులు ఈ మేరకు సమాచారం ఇస్తున్నారు. వరుసగా మూడేళ్లపాటు వడ్డీ చెల్లించని రైతుల ఖాతాలను బ్యాంకులు ఎన్పీఏగా ప్రకటిస్తున్నాయి. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని ఇలాంటి ఖాతాలని పేర్కొంటున్నారు .. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఏడు లక్షల ఖాతాలు ఎన్పీఏగా నమోదయ్యాయి. వారిపై 4,748 కోట్ల మేరకు అప్పులున్నాయి.
సాధారణ ఖాతాదారులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక వేత్తలు వరుసగా మూడు కిస్తీలను చెల్లించని పక్షంలో ఎన్పీఏగా ప్రకటించి జప్తు చేసే విధానం అమలవుతోంది. రైతులకు రుణమాఫీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మూడేళ్ల కాలపరిమితి వరకు అవకాశం కల్పిస్తున్నాయి. ఆ తర్వాత రెన్యువల్ గానీ, పూర్తిగా చెల్లింపులు జరపకపోయినా నిరర్థక ఖాతాలుగా బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. రాష్ట్రంలో కొంతకాలంగా రుణమాఫీ పథకం అమలు అవుతుండడంతో చాలా మంది రైతులు అసలు, వడ్డీలు కూడా చెల్లించడం లేదు. తమ ఖాతాలను రెన్యువల్ కూడా చేసుకోవడం లేదు. గతంలో ఎన్పీఏలతో సంబంధం లేకుండా రుణాలు మాఫీ అయ్యాయి. తాజాగా ప్రభుత్వం 2018 డిసెంబరు 12 నుంచి రుణమాఫీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతకుముందు తీసుకున్న రుణాలకు ఇది వర్తించదని స్పష్టంగా చెప్పింది. అలా ఉన్న రైతు ఖాతాలు పది లక్షలకుపైగా ఉండగా అందులో ఎన్పీఏ ఖాతాలు 6.91 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు కంటే వడ్డీ ఎక్కువంటూ… తాజాగా ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమ చేయకపోవడంతో ఆయా రైతులు బ్యాంకులకు వచ్చి ఆరా తీస్తున్నారు. దీర్ఘకాలికంగా అసలు, వడ్డీ చెల్లించని కారణంగా మొండి బకాయిలుగా ఉన్నాయని, అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నాయని వాటికి రుణమాఫీ వర్తించదని బ్యాంకులు చెబుతున్నాయి. దీనితో రైతులు ఆందోళన చెందుతున్నారు .. తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు .. మరి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది అనేది చూడాలి .