వంగలపూడి అనిత ఆ పేరు లోనే ఫైర్ ఉంది … టీడీపీ లో గట్టి లీడర్ కి పోటీ ఇస్తూ తనదైన రీతిలో రాజకీయాలు మొదలుపెట్టి .. ప్రస్తుతంచంద్రబాబు కాబినెట్ లో మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్నది … అసలే ఫైర్ బ్రాండ్ .. మంత్రి అయ్యాక జోష్ పెంచింది ..
ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ … వైసీపీ ను చెడుగుడు ఆడేస్తది .. అయితే ముఖ్యంగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి అనిత.. 2014కు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత… 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను.. పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. కూడా టీడీపీ కోసం వంగలపూడి అనిత పనిచేశారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. జగన్ పై కూడా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తుంది .. అయితే
ఏపీలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అక్రమాలు, దారుణాలను, పరిపాలనలో లోపాలనూ కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చి ఎండగడుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ పలు కీలక విషయలు తెరపైకి వస్తున్నాయి.. గత ఐదేళ్ళు పోలీసు వ్యవస్ధ నిర్లక్ష్యం చేయబడింది… పోలీస్ డిపార్టుమెంటుకు ఏం కావాలని అనే అంశాలు పట్టించుకోలేదని ఆగ్రహించారు జగన్ పు అనిత ధ్వజమెత్తారు ..
అయితే మొన్న జగన్ అసెంబ్లీ వద్ద జరిగిన రచ్చ అందరికి తెల్సిందే … దానిలో భాగంగా పోలీసులపై విరిసుకుపడాడ్రు .. పాత ప్రభుత్వాన్ని ఎత్తి చూపడం కాదు… పోలీసులు అంటే ప్రత్యేక రిక్రూట్మెంట్ విధానం ఉంది… సీఐడీ నిన్నటి వరకూ ఎలా పని చేసిందో అందరికీ తెలుసు అన్నారు.మరో వైపు టోపీపై ఉన్న మూడు సింహాలకు అర్ధం ఏమిటో తెలుసా.. అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్ కొట్టడానికి కాదు, ప్రాజాస్వామ్యాని కాపాడటానికి అని జగన్ క్లాసులు పీకుతున్నారు.ఈ నేపథ్యంలో శాసన సభలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఇందులో భాగంగా… గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను పలు అంతర్గత లోపాలు వెంటాడాయని చెబుతూ… గతంలో మహీందర కంపెనీ ఏపీ పోలీసు శాఖను బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని, కోర్టులో కేసు వేసిందని పేర్కొనడం గమనార్హం.. గత వైసీపీ ప్రభుత్వం ఏపీ పోలీసు శాఖ కోసం మహీంద్రా కంపెనీ నుంచి వాహనాలను కొనుగోలు చేసిందని.. అయితే వాటికి సంబంధించి 2021 సమయంలో సుమారు 17కోట్ల రూపాయలు పెట్టి పోలీసు శాఖకు వాహనాలు అయితే కొన్నారు అని చెప్పిన అనిత.. వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం చెల్లించలేదని వెల్లడించారు.దీంతో… మహీంద్రా కంపెనీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఈ విషయం కోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల రూ.13 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.