ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ వార్… డైలీ సీరియల్ మాదిరి కొనసాగింది . . వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేకులేసింది మొదలు.. ప్రతిపక్షాల మధ్య నాన్‌స్టాప్‌గా సాగిన మాటల యుద్ధం పీక్స్‌కు చేరిపోయింది.. ఎన్నికల ముందు పెన్షన్ల పంపిణీ- వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ-కూటమి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు హోరెత్తుతున్నాయి. చంద్రబాబు వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని సూచించారు కూడా …అప్పట్లో అది పెద్ద చర్చ నడిచింది … అయితే ఏపీ కూటమి ప్రభుత్వం కాస్త ఆలస్యమైన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అందరికి అందే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేసింది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం హామీ పై మంత్రి నారా లోకే ష్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉండే అందరికి ఈ పథకం వర్తిస్తుందని ఆయన చెప్పారు. నిధుల లోటుపాట్ల కారణంగా వచ్చే ఏడాది తల్లికి వందనం అమలు ఉంటుందని మంత్రి తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు వారికిస్తున్న 5వేల రూపాయాల వేతనాన్ని 10వేల రూపాయాలకు పెంచడం కూడా ఉంది.అసలు తిప్పలు ఇప్పుడే మొదలయింది.. ఏపీ లో నిధులు లేవు .. అదికాక హామీలు నెరవేర్చలు … సో దానిపై చంద్రబాబు కసరత్తులు చేస్తున్న తరుణంలో …
అయితే వాలంటీర్లకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త వినిపించడమే కాకుండా కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా వాలంటీర్లకు సంబంధించిన ప్రశ్నను పంపించారు. దీనిపై సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వాలంటీర్ల వేతనాన్ని పెంచబోతున్నట్లు వెల్లడించారు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే వారికి సంబంధించి మంచి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ వ్యవస్థను కూడా రాష్ట్రంలో కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉందని ప్రభుత్వం చెబుతున్న తరుణంలోనే వారి వేతనాలను త్వరలోనే పెంచబోతున్నట్లు చెబుతుండటం ఆసక్తికరంగా మారింది.
నిధుల కొరత వెంటాడుతున్న తరుణంలో 10వేల రూపాయాలకు పెంపు అనేది ప్రభుత్వానికి భారంగా మారుతుందా..? అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది… చంద్రబాబు హామీ ఇచ్చారు గనుక
వాలంటీర్ల కు న్యాయం చేయాలి లేదంటే … జగన్ పై వ్యతిరేకత వచ్చినట్లు చంద్రబాబు పై కూడా వ్యతిరేకత వస్తే … ప్రజలు ఊరుకోరని బాబు కి బాగా తెల్సు … వాలంటీర్లకు 10వేల రూపాయాల వేతనం పెంచి, వారి విద్యార్హతలను పరిశీలించి, వీరికి మూడు సంవత్సరాల కాలపరిమితితో మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ మూడు సంవత్సరాల కాలంలో వీరికి ఎటువంటి విధులు కేటాయిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.