ఓ మహిళా అధికారి భర్త చేసిన ఆరోపణలతో విజయసాయిరెడ్డి నిండా మునిగిపోయారు. విజయసాయిరెడ్డి అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరంగా సోషల్ మీడియాలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ను తిట్టాడు .. ఇప్పుడు అయినా చేసిన పని ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ..అసలేంటి సంగతి అంటే ..
స్వయంగా ఉద్యోగిని భర్తే ఫిర్యాదు చేయడంతో ఆయనను ఆయన డిఫెండ్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంది. అందుకే సస్పెండ్ అయిన మహిళా అధికారితో ప్రెస్ మీట్ పెట్టించి .. సానుభూతి రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. అది వారి కుటుంబ సమస్య. మీడియా ముందుకు ఎందుకు తెప్పించుకున్నారో కానీ.. విజయసాయిరెడ్డి నిండా మునిగిపోయే పరిస్థితి రావడం వల్లనే ఆమెతో ప్రెస్మీట్ పెట్టించారని చెబుతున్నారు.
ప్రెస్ మీట్ లో ఆ అధికారిణి చెప్పిన మాటలకు అందరు షాక్ అయ్యారు .. తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. తనకు పుట్టిన బిడ్డకు లాయర్ సుభాష్ కారణం అని చెబుతున్నారు. ఎప్పుడో విడిపోయామంటారు కానీ.. గత ఏప్రిల్ లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నానంటారు. సుభాష్ ఎక్కడ పరిచయం అయ్యారంటే.. తనను ఓ అధికారి వేధించారని.. ఆ కేసులో సాయం చేయడానికి పరిచయమయ్యారని చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డిని ఎంపీ అనే కలిశానని.. ఆయన చాలా మంచివారన్నారు. ఆమె మాటల్లో ప్రేమ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి తన వెర్షన్ చెప్పడానికి ప్రెస్ మీట్ పెడుతున్నారు.. మీడియా మీద ఏడ్చి ఆయన వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇందులో ఆ అధికారిణి భర్త తనపై చేసిన ఆరోపణలకు సమాధనం చెప్పడంతో పాటు డీఎన్ఏ టెస్టుకు కూడా రెడీ అని ప్రకటిస్తే… కాస్త నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు..