ఏపీ లో రషీద్ ఇన్సిడెంట్ ఒకవైపు … మరోవైపు వైసీపీ లో విజయ్ సాయి రెడ్డి వివాదం మరోవైపు … వాటితో రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఓ వివాదం హార్ట్ టాపిక్ గా మారింది..వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కేంద్రంగా.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఆమెకు పుట్టిన బిడ్డ విషయంపై చెలరేగిన వివాదం పై స్పందించిన సాయి రెడ్డి.. మీడియాపై తన అక్కసును వెళ్ళగక్కారు. అయితే ఈ వివాదం జఠిలమవుతోంది. ఒక పార్టీ అధినేతగా జగన్ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది.. కానీ జగన్ దీనిపై ఎందుకు మౌనం గా ఉన్నారంటే ..?
అసలే సొంత పార్టీ నాయకుడు … ఇలాంటివి న్యూస్ వస్తే ప్రజల్లో ఇంకా పరువు పోతుందని అలోచించి అది కాకుండా మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు … ఈ ఇష్యూ పై ఇప్పుడు మాట్లాడితే అసలేకే ఎసరు అనుకోని కామ్ గా ఉన్నారు … అధికాకూండా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి అక్రమాలకు పాల్పడ్డారు … అవన్నీ ఎక్కడ బయటపడతాయో అని సైలెంట్ గా ఉన్నారు … వైసీపీ నేతలు చేసిన దారుణాలు అన్ని ఇన్నీ కావు … పదవులు చేతిలో ఉన్నాయి కదా అని రెచ్చిపోయి మినిస్టర్స్ … ఎమ్మెల్యేలు ప్రజలను ఒకాటాడుకున్నారు … ప్రజలు వాళ్ళ అక్రమాలను చూడలేక జగన్ కి బై బై చెప్పారు … మొత్తానికి విజయ్ సాయి రెడ్డి వ్యవహారంలో వైసీపీ నేతలు నోరు మెదపకపోవడనికి వాళ్ళు చేసిన అక్రమాలు… దందాలే …
దీనికి తోడు ఇక ప్రకాశం జిల్లా వైసీపీలో సరికొత్త వివాదం నడుస్తోంది.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య గట్టి ఫైట్ నెలకొంది. దీనిపై స్పందించాల్సిన అవసరం జగన్ పై ఉంది.. లేకుంటే ప్రకాశం జిల్లా ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకొని అన్ని జిల్లాల్లో.. వైసీపీలో విభేదాలు తలెత్తే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి..ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం జగన్ పై ఉంది. అందుకు సంబంధించిన ఘటనలు కూడా వరుసగా జరుగుతున్నాయి. పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. అత్యాచారయత్నాలకు తెగబడ్డారు. వీటిని ఖండించాల్సిన అవసరం ఒక పార్టీ అధినేతగా జగన్ పై ఉంది. కానీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక.. స్పందించలేను అన్నట్టు ఉంది జగన్ వ్యవహార శైలి. తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్టు ఉంది ఆయన వైఖరి. ఇలానే కొనసాగితే మాత్రం ఏపీ ప్రజల్లోనే కాదు.. సొంత పార్టీలోను కూడా జగన్ పలుచన కావడం ఖాయం. ఇక తేల్చుకోవాల్సింది జగనే.