వైసీపీ అధికారంలో ఉన్న సమయం లో చేసిన అన్యాయాలు … అక్రమాలు లెక్క లేవు … అధికారంలో ఉన్నాం కదా అని ఆ పార్టీ నేతలు చంద్రబబు , లోకేష్ , పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసారు …
కూటమితో పొత్తు పెట్టుకొని బాబు విజయం సాధించి … జగన్ కు సరైన గుణపాఠం చెప్పారు … టీడీపీ ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీలపై ఫోకస్ చేస్తుంటే … జగన్ ఢిల్లీ లో కూర్చున్నారు … అయితే
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చోటు చేసుకుంటున్న రాజకీయ హింసపై ఢిల్లీ వేదికగా జగన్ పోరు మొదలు పెట్టినా .. ఎవరు పెద్దగా పట్టించుకోలేదు . అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే .. ఇక్కడ చేయాల్సిన పోరాటం ఢిల్లీలో చేయడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఢిల్లీలో వైసీపీ ధర్నా మొదలయ్యాక చోటు చేసుకున్న పరిణామాలు ఊహించని రీతిలో మారిపోయాయి .
రాష్ట్రంలో ఎన్డీయే కూటమిపై పోరాడుతున్న నేతగా జగన్ ను ఇండి యా కూటమి అక్కున చేర్చుకుంది. కాంగ్రెస్ మినహా కూటమిలో పార్టీలు జగన్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇండియా కూటమిలోని కీలక పార్టీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. అలాగే ఉద్దవ్ థాకరే శివసేన వర్గానికి చెందిన కొందరు ఎంపీలు ఈ దీక్షకు మద్దతు పలికారు. ఇక ఢిల్లీలో ఉన్న జగన్ ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో వైసిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.తనను చంపాలనుకుంటే చంపేయండి అని జగన్ అన్నారు .. అంతేగాని మీకు ఓటు వేయలేదని కారణంతో అమాయకులైన ప్రజలు .. కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి దాడులు చేయటం సరికాదని అన్నారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చకి వస్తున్నాయి. ఇక ఢిల్లీ ధర్నాలో అనూహ్యంగా లభించిన మద్దతు ఇప్పుడు జగన్ ఆలోచనల్ని మార్చేసేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఎన్డీయేపై పోరాడాల్సిన పరిస్ధితిని జగన్ కు కల్పిస్తోంది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ఇతర సాయంపై కేంద్ర, రాష్ట్రాల్ని నిలదీసే పనిని జగన్ చాలా ముందుగానే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలంటూ వైసీపీ చేసిన డిమాండ్ చూస్తుంటే పార్లమెంట్ లోనూ ఎన్డీయే కూటమితో అమీతుమీకి జగన్ సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే జగన్ అంతటి సాహసం చేసే ఛాన్స్ లేదని … పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టే .. అక్కడే ఉన్న అఖిలేష్ యాదవ్ .. ఇతర ఎంపీలు వచ్చారు తప్ప జగన్ కి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం లేదన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది ..అంతేకాదు జగన్ ని దగ్గరకి చేర్చుకొని ఛాన్స్ కాంగ్రెస్ ఇవ్వదని ..అందుకే జగన్ నిరసనలకు కాంగ్రెస్ దూరంగానే ఉందన్న టాక్ బలంగా వినిపిస్తుంది .