ఏ పార్టీ అయినా బలంగా ఉండాలంటే .. నాయకులతో పాటు కేడర్ కూడా అత్యంత కీలకం…జెండాలు మోసేదీ.. జేజేలు కొట్టేదీ కూడా వారే.. పార్టీ కోసం కష్టపడుతూ ఉంటారు .. అందుకే అన్నిపార్టీలూ కేడర్‌ను దృష్టిలో పెట్టుకుని సభ్యత్వానికి శ్రీకారం చుడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి…టీడీపీ అయినా.. జనసేన అయినా.. కేడర్ వైపు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి.. కేడర్ బలంగా ఉంటేనే అందులో పెద్ద తలకాయలు స్ట్రాంగ్ గా ఉంటారు .. అలాగే నాయకులు తయారవుతారు.. కానీ కేడర్ పోతే మాత్రం కష్టం అనే భావన పార్టీల్లో ఉంది. నాయకులను అనుసరించే కేడర్ కొంత ఉంటే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీకి అంకిత భావంతో పనిచేసే కేడర్ కూడా ఉంటుంది…ఈ విషయంలో వైసీపీ ఇప్పుడు కేంద్రంగా మారింది. కేడర్‌ను కాకుండా వలంటీర్లను నమ్ముకున్న ఫలితంగా జగన్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ వలంటీర్లకే ఇచ్చారు. వలంటీర్లతోనే చేయించారు.. దీంతో కేడర్ తీవ్రంగా దెబ్బతింది.
కేడర్ కి పార్టీ కోసం ఏపీని చేసే పరిస్థితి లేకుండా హెసెరు జగన్ .. ఆ టైం లో కేడర్ బాగా హర్ట్ అయింది అని చెప్పాలి .. వాలంటీర్స్ కి బాధ్యతలు ఇచ్చిన జగన్ ఓడిపోయారు .. ఇది ఎన్నికల సమయంలో కనిపించింది… ఇక వాలంటీర్లు వేతనం కోసం పనిచేశారే.. తప్ప పార్టీ కోసం కాదని కూడా ఎన్నికల వేళ తేలిపోయింది… రూ.5000 కాదు.. రూ.10 వేలు ఇస్తామన్న టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేశారని జగనే చెప్పారు… దీంతో అటు కేడర్, ఇటు వలంటీర్లు కూడా వైసీపీకి హ్యాండిచ్చారు. ఇది ముగిసిన కథ. అయితే.. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి కేడర్ అయినా.. మిగులుతుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. నాయకులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. కానీ అవకాశమే లేకుండా పోయింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ రెడీ అవుతున్నాయి.నాయకులు కనుక రేపు ఈ రెండు పార్టీల్లోకి వెళ్లిపోతే.. కేడర్ కూడా వారిని అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మొత్తానికి కేడర్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది …