ఏపీలో కొన్ని పరిణామాల తరువాత అక్కడ రాజకీయాలు మారిపోయావు .. అభివృద్ద్దే ద్వేయంగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు … పవన్ కళ్యాణ్ .. అయితే వైసీపీ ఓటమి తర్వాత జగన్ సైలెంట్ అయ్యారు .. అలాగే నోర్లు వేసుకొని రెచ్చిపోయే
నేతలు అడ్రస్ ఎక్కడ కనిపించడం లేదు. .. చాలామంది రాష్ట్రం దాటి వెళ్ళిపోతే.. ఉన్న కొంతమంది బయటకు రాకుండా తాము ఎక్కడ ఉన్నామో ఎవరికీ తెలియకుండా.. టైంపాస్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రతి వారానికి ఓ వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో చాలా సంచలన విషయాలు బయటపెడుతున్నారు. పైగా వైసీపీ ప్రభుత్వం లో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపెడుతున్నారు. ఈ ఆరోపణలని ఖండించడానికి ఒక్క పేర్నినాని మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి అవి అబద్దమని ఆరోపిస్తూ ఉన్నాడు … జగన్ కు తోడు పేర్ని నాని ఒక్కడే అన్నట్లు పార్టీ నేతలు ఉన్నారు … మిగతావారంతా జగన్ అధికారం నుండి దిగిపోగానే అందరు ఎటువాళ్ళు అటే తట్టా బుట్టా సర్దుకున్నట్లు వ్యవహారం కనిపిస్తుంది ..
అయితే దీనిలో భాగంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు అదే పరిస్థితి. ఉత్తరాంధ్ర మొత్తం నీదే అని జగన్ చెబితే ఉత్సాహపడిపోయి తన భార్యను విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేయించి ఘోరంగా చేతులు కాల్చుకున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అయితే.. ప్రతిరోజు తనపై వస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బొత్స బయటికి వచ్చి మాట్లాడేందుకే ఇష్టపడటం లేదు… భార్య కూడా ఎవరికీ మొహం చూపించకుండా ఉంది … ఎన్నికల ముందు బేబీ తప్పులను ఎట్టి చూపిన వైసీపీ నేతలు ఎక్కడికి పోయారని ఏపీ ప్రజల్లోకలుగుతుంది ..
అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు.. ఏ ఒక్క సీనియర్ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం ఒక్క మాట మాట్లాడటం కానీ.. బయటకు రావడం కానీ.. చేయడం లేదు . చాలామంది అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తమ చేతిలో అధికారం ఉందని అడ్డగోలుగా దోచుకున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసేందుకు ఇష్టం వచ్చినట్టు అధికార యంత్రాంగాన్ని వాడుకున్నారు. ఇప్పుడు అధికారం పోవడంతో తాము బాధలు పెట్టినవారు ఊరుకోరని.. తమను కూడా అలాగే టార్గెట్ చేస్తారని భయంతో వైసీపీ నేతలు కాలం గడుపుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది.