వైసీపీ అధికారం కోల్పోవడానికి కొందరు నేతల నోటి దురుసు , అధికార దుర్వినియోగం వంటివి కూడా కారణమని చెబుతారు .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు నేతలపై విమర్శలు వచ్చాయి ..ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెందిన రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తిరుమల కొండలపై వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో వీరు విమర్శలు ఎదుర్కొన్నారు …రోజా, చెవిరెడ్డి తరచు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు రావడమే కాకుండా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం .. వారితో పాటు తమ అనుచరులను కూడా పెద్దసంఖ్యలో తీసుకొచ్చారు. చాలా సార్లు ఆలయ ప్రోటోకాల్‌ను కూడా ఉల్లంఘించారు.
అంతేకాకుండా,వందలాది మందికి విఐపి బ్రేక్ దర్శనాలు వసతిని కూడా తప్పకుండా ఏర్పాటు చేసేవారు. విఐపిలకు సిఫార్సులు చేస్తూ నేతలు కూడా భారీగా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీఐపీ దర్శనం, వసతి కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానంకి రోజా, చెవిరెడ్డి రాసిన లేఖలు మీడియాకు లీక్ అయ్యాయి .. అయితే ఇప్పుడు టీడీపీ శాసనసభ్యులు కూడా రోజా, చెవిరెడ్డిలకు ఈ మాత్రం తగ్గడం లేదని తెలుస్తుంది .తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా వైఎస్సార్సీపీ నేతల తీరులోనే తిరుమలలో ప్రవర్తించారు. శ్రీవాణి ట్రస్టు కోటా కింద దర్శనాలను క్రమబద్ధీకరిస్తున్నామని, విచక్షణా రహితంగా టిక్కెట్ల జారీపై ఆంక్షలు విధిస్తున్నామని ఒక పక్క టీటీడీ అధికారులు పేర్కొంటుండగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం పులివర్తి నాని 300 మంది పార్టీ అనుచరులతో కలిసి తిరుమలకు వెళ్లారు … నాని అనుచిత ప్రవర్తనపై టీటీడీ అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యకరం కలిగిస్తుంది . ఒక ఎమ్మెల్యే ఎక్కువ మందికి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు చేయలేరు. అయితే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు . అయితే ఇప్పటికైనా టీడీపీ నేత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది .. ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది . టీటీడీ ప్రక్షాళన దిశగా ముందుకు సాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడుకి నేతలు సైతం సహకరించి ప్రజల ఆదరణ చూరగొనాల్సిన అవసరం ఉంది ..గత ప్రభుత్వం చేసిన తప్పులు జరక్కుండా జాగ్రత్త పడితేనే ప్రజాదరణ సొంతం అవుతుంది .