శాంతి మిస్టరీ… తెలిసి పోయిన తండ్రి ?
ఇటీవల ఏపీలో హాట్ టాపిక్ గా విజయ్ సాయి రెడ్డి వ్యవహారం మారింది … ఏపీ దేవాదాయశాఖలో డిప్యూటీ కమిషనర్ కాళంగిరి శాంతి , విజయ్ సాయి రెడ్డి కి అక్రమ సంబంధం ఉందని … కొద్దీ రోజులుగా రచ్చ నడుస్తుంది .. ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది … తన భార్యకు కలిగిన బిడ్డకు తండ్రెవరో తేల్చాలంటూ గతంలో దేవాదాయశాఖకు ఆమె భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు నీ భర్తెవరో చెప్పాలంటూ ఆమెకు అధికారులు మెమో జారీ చేశారు. ఆమె భర్త వివాదం, దాని వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు కలుగుతున్న భంగం, ఆమె వ్యవహారశైలిపై పూర్తి వివరణకు ఆదేశించారు. దేవాదాయశాఖలో ఉద్యోగంలో చేరిన సమయంలో తన భర్త పేరు కె మదన్ మోహన్ గా పేర్కొన్న శాంతి.. గతేడాది ప్రసూతి సెలవుకు దరఖాస్తు చేసుకున్న సమయంలోనూ అదే చెప్పారు. అయితే ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పడం, అంతకు ముందే ఆమె సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ..
అధికారులు ఆమెకు మెమో జారీ చేశారు. నీ భర్తెవరో చెప్పాలంటూ ఆదేశించారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమంటూ, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆమెకు మెమో పంపారు. దీంతో పాటు మరో ఆరు అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటికే సస్పెండ్ చేస్తూ 9 అభియోగాలు మోపిన అధికారులు.. తాజాగా మరో 6 అభియోగాలు మోపారు. ఇందులో భర్త పేర్లు మార్చడం, దేవాదాయశాఖ ప్రతిష్టకు భంగం కలిగించడం, కమిషనర్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం, సాయిరెడ్డిపై గతేడాది పెట్టిన ట్వీట్, విశాఖలో అపార్ట్ మెంట్ ఫ్లాట్ ఓనర్లతో గొడవ, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఆలయ దుకాణాలు, భూముల లీజుల పొడిగింపు వంటి అంశాలు ఉన్నాయి.. విజయసాయిరెడ్డితో శాంతి అనుబంధంపై ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేస్తున్న వేళ .. గతేడాది మే 28న ఆమె పెట్టిన ట్వీట్ పై అభియోగం నమోదైంది. ఇందులో ఆమె.. ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సర్. మీరు పార్టీకి వెన్నెముక అంటూ పెట్టిన ట్వీట్ పై అభియోగం మోపారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ఈ ట్వీట్ పెట్టారని అందులో పేర్కొన్నారు. మరోవైపు శాంతి డిప్యూటీ కమిషనర్ గా విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో పనిచేసినప్పుడు చేసిన అక్రమాలపై విచారణకు అధికారులతో మరో కమిటీ వేశారు. మరి వీటిపై ఆమె ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి ..