నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా వీరిపై ఫోకస్ పెరిగింది. ఆగస్టు 8, 2024 ఉదయం కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్థం జరిగింది.
ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రకటించారు. సంప్రదాయ దుస్తుల్లో శోభిత, చైతన్య దంపతులు చాలా సంతోషంగా కనిపించారు.
శోభిత ధూళిపాళ్ల పేరు ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం చాలా మందికి తెలియకపోవచ్చు. తెనాలిలో పుట్టిన ఈ సుందరి జీవిత కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె కూడా ఆమ్స్ వ్యాపారవేత్త కుమార్తె అని మొదట వార్తలు వచ్చాయి. అలాగే నాగ చైతన్యతో ఇంచుమించు ఆస్తులు ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి.
అయితే ఆ వార్తల్లో నిజం లేదు. ఆమె తండ్రి వేణుగోపాలరావు మర్చంట్ నేవీ ఇంజనీర్ మరియు ఆమె తల్లి శాంతా కామాక్షి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు. సాధారణ తెలుగు కుటుంబం నుంచి వచ్చిన శోభిత విశాఖపట్నంలో తన కుటుంబంతో కలిసి పెరిగారు. అక్కినేని ఆస్తులు వారి ఆస్తులతో పోలిస్తే చాలా తక్కువ. అయితే నాగ చైతన్య మాత్రం ఆమెతో జీవితం బాగుంటుందని భావించి పెళ్లికి సిద్ధమయ్యాడు.
శోభిత తండ్రి మర్చంట్ నేవీలో పనిచేస్తుండడంతో కుటుంబం తరచూ మారుతూ ఉండేది. అయితే, శోభిత చిన్న వయస్సులోనే ముంబైకి వెళ్లి, అక్కడ నుండి ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఆమె ముంబైలోని వివిధ విశ్వవిద్యాలయాలలో వాణిజ్యం, ఆర్థికశాస్త్రం మరియు కార్పొరేట్ న్యాయశాస్త్రంలో వివిధ కోర్సులను పూర్తి చేసింది.