Home Telugu శ్రీ కొణెదల పవన్ కళ్యాణ్ కు అశేషమైన అభినందనలు

శ్రీ కొణెదల పవన్ కళ్యాణ్ కు అశేషమైన అభినందనలు

by malakapalli
0 comment
Pawan Kalyan - Gold Andhra

జనసేన అధినేత మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొణెదల పవన్ కళ్యాణ్ కు అశేషమైన అభినందనలు మరియు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఆయన కలిసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ తానే జిల్లాల వారీగా వచ్చి అందర్నీ కలుస్తానని ప్రకటించారు.

నాకు అభినందనలు తెలుపుతున్న నాయకులు మేధావులు నిపుణులు, సిని రంగంలో ఉన్నవారు, యువత, రైతులు మరియు నా అభిమానులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు. నన్ను కలవడానికి వచ్చేవారు బొకేలు శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఈనెల 20వ తారీఖున తనని అత్యధిక మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి వస్తానని, అక్కడ మళ్ళీ అందర్నీ కలుస్తానని, ఆ తర్వాత దశలవారీగా గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved