ప్రస్తుతం సానియా మీర్జా రెండో పెళ్లి అంటూ వస్తున్నా వార్తలకు
సోషల్ మీడియా తెగ హల్చల్ అవుతున్నాయి .. సానియా మీర్జా అందరికి తెల్సిన అమ్మాయే .. మన తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది …
సానియా మీర్జా రెండో పెళ్లి మ్యాటర్ గురించి.. ఏకంగా భర్తతో విడాకులు తీసుకున్న టీమిండియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాతో మహమ్మద్ షమీ రెండో పెళ్లి జరగబోతుంది అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే… అయితే షమీ కూడా ఇప్పటికే తన భార్య హసిన్ జహాన్ తో విడాకులు తీసుకొని విడిపోయారు… ఇదద్రు విడాకులు తీసుకున్నారు కాబట్టి రెండో పెళ్ళికి సిద్దమవుతున్నట్లు న్యూస్ వస్తుంది …
అయితే ఇలా సానియా మీర్జా, షమీ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై సానియా మీర్జా ఇప్పటివరకు స్పందించలేదు…
కానీ సానియా మీర్జా తండ్రి ఘాటుగానే రియాక్ట్ అయ్యారు… ఇలాంటి వదంతులు సృష్టించవద్దు అంటూ సోషల్ మీడియా జనాలను కోరాడు. ఇక ఇప్పుడు సానియా మీర్జాతో పెళ్లిపై మహమ్మద్ షమీ కూడా ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను సానియాతో పెళ్లి రూమర్లకు గురించి ఘాటుగానే స్పందించాడు…దీనిపై క్లారిటీ ఇచ్చాడు … అయినా ట్రోలర్స్ ఊరుకుంటారా ఒక న్యూస్ దొరికితే పీల్చి పిప్పి చేస్తారు … దాని అంతు చేసేవరకు నిద్రపోరు …
సానియా మీర్జాతో పెళ్లి అనేది కేవలం రూమర్స్ మాత్రమే అని షమీ చెప్పేసాడు … సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఇలాంటి పోస్టులు పెడతారు. దమ్ముంటే నిజమైన అకౌంట్ నుంచి ఇలాంటి పోస్టులు చేయండి.. అప్పుడు నేనేంటో చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చాడు … ఇప్పుడు నా జీవితం ప్రశాంతంగా ఉంది. ఎవరో ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి వెళ్లినంత మాత్రాన అంత సర్వనాశనం కాదు. ఇప్పుడు నా కూతురు మా అమ్మతో హ్యాపీగా లైఫ్ ని డిలీట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు
ఇదంతా పక్కన పెడితే షమీ ఎవరు … ఏమి చేస్తారు అనేది చూద్దాం …
టీమిండియాలో స్టార్ ఫేసర్ గా కొనసాగుతున్న మహమ్మద్ షమీ గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా ఫైనల్ వరకు దూసుకువెళ్లడంలో కీలక పాత్ర వహించాడు. కానీ ఆ వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయి అందరిని నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే .. అయితే అది తనకి నిరాశని ఇచ్చింది … ఇక ఇప్పుడు గాయం నుంచి కోలుకోవడంతో మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. బంగ్లాదేశ్ తో జరగబోయే సిరీస్ ద్వారా మళ్ళీ షమి రీ ఎంట్రీ ఉండబోతుంది అన్నది తెలుస్తుంది.
.