టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరంటే ఆలోచించకుండా సమంత , నాగ చైతన్య అనుకునేవాళ్లు … వాళ్లిద్దరూ అంత చూడముచ్చటగా ఉంటారు .. వీరిద్దరి బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు… ఎవరి సినిమా షూటింగ్స్ లో వాళ్ళు బిజీ గా ఉన్నారు ..కానీ సమంత కొన్ని ఇంటర్వూస్ లో కంటతడి పెడుతూనే ఉంటుంది ..
అయితే విడాకుల విషయంలో అభిమానులు
సమంతదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
అసలు వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు బయటపెట్టలేదు.. వారు కూడా ఎక్కడ నోరు మెదపడంలేడు ..
దానితో ఫ్యాన్స్ ఈ విషయంపై సోషల్ మీడియా లో రచ్చ చేసి మరీ విసుగుచెందారు … అయినా సమంత కానీ నాగ చైతన్య కానీ ఈ వ్యవహారంలో ఏమి జరిగిందో బయటపెట్టలేదు.. అయితే
నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూ కొద్దిరోజులు సినిమాలకు సైతం దూరం అయింది. వ్యాధి నయం కావడంతో తిరిగి సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని సమంత చెప్పుకొచ్చారు ..గడిచిన రోజులు నా లైఫ్ లోకి రాకూడదని కోరుకుంటున్నానని సమంత కన్నీళ్లు పెట్టుకున్నారు … ప్రస్తుతం అంతా బాగానే ఉందని మునుపటి రోజుల కంటే బలంగా అయ్యానని సామ్ పేర్కొన్నారు.ఆ చీకటి రోజుల నుంచి బయటపడితే లైఫ్ లో విజయం సాధిస్తామని సమంత చెప్పుకొచ్చారు.. దీంతో ఇది సామ్ విడాకుల గురించే ఇన్ డైరెక్ట్‌గా కామెంట్స్ చేసిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.