టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత..ఆమె అందం అభినయంతో అందరిని కట్టిపడేస్తుంది .. టాప్ హీరో ల సరసన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నది .. అంత బాగానే ఉన్న తన లైఫ్ లో డివోర్స్ విషయం కాస్త బాధ కలిగిస్తుంది ..డివోర్స్ తర్వాత సామ్ మానసికంగా చాలా కుంగిపోయింది. అంతే కాకుండా, మయోసైటీస్ అనే వ్యాధిబారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన హెల్త్‌పై ఆమె ఫోకస్ చేసింది. ఆ టైం లో చాలా ట్రోల్స్ కి గురయింది .. నెటిజన్స్ ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసారు .. అయితే మానసిక ప్రశాంతత కోసం వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ, ధ్యానం చేస్తూ వచ్చింది.అయితే సమంత తన జీవితం కూడా మరో సావిత్రిలా అయ్యేదని, కానీ తృటిలో తప్పించుకున్నాను అంటూ ఓ సందర్భంలో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సావిత్రి జెమినిగణేషన్ను వివాహం చేసుకొని, ఆయన వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడంతో అధి భరించలేక ఆమె వ్యసనాలకు బానిసై, ఆస్తిని పొగొట్టుకొని, కోమాలోకి వెళ్లి, జీవచ్ఛవంలా మారి డిసెంబర్ 26న కన్నుమూశారు..ఒక సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. తకు సావిత్రి గురించి అంతగా తెలియదు అని, కానీ మహానటి సినిమా, ఆమె సినిమాలు చూశాక తన గురించి తెలుసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది. నా జీవితం కూడా అలాగే అయ్యేదని, సావిత్రి గారిలానే నేను కూడా ప్రేమ విషయంలో ఒకసారి మోసపోయాను కానీ అదృష్టం కొద్ది అందులో నుంచి బయటపడగలిగాను. లేకపోతే నా లైఫ్ కూడా అలానే అయ్యేదంటూ ఒప్పుడు సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే దీంతో ఈ కామెంట్స్ విన్న కొందరు సామ్ సిద్ధార్థ్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందంటే, చైతుని ఉద్దేశించి కావచ్చు, ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది కదా అందుకే ఆ కామెంట్స్ చేసిందని మరికొందరు అంటున్నారు.
Follow Us For More Updates
Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.
© 2024 GoldAndhra | All Rights Reserved