తెలంగాణ రాజకీయాల్లో పరిణమాలు వేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు క్యూ కట్టగా.. మరో వైపు పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది.. ఇలానే కొనసాగితే బీఆర్ఎస్ లో నేతలు మొత్తం ఖాళీ అవుతుంది .. ఇంక పార్టీ పట్టు కూడా కోల్పోతుంది .. ఈ తరుణంలో శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ప్రకాష్ గౌడ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీ మారడానికి సిద్దమయ్యారని తెలుస్తోంది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సైతం కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయ్యారని సమాచారం..
ఇదిలా ఉంటే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. అరికెపూడి గాంధీ తొలుత టీడీపీలో పని చేశారు. రాష్ట్రంలో టీడీపీ కనుమరుకు కావడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక ఇటీవల ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ అయిన కొద్ది రోజులకే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు అరికెపూడి గాంధీ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నద్ధం అవుతున్నారు. దీంతో చంద్రబాబు హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది… చంద్రబాబు ఏపీ లో ప్రజల్ని వదిలేసి తెలంగాణ పై ఫోకస్ ఎందుకు పెట్టారు .. చంద్రబాబు తో అరికెపూడి గాంధీ కి భేటీ ఎందుకు కుదిరింది ..కేసీఆర్ ను దెబ్బ కొట్టనికే బాబు తెలంగాణ రాజకీయాలల్లో వేలు పెడుతున్నారు అంటూ బిఆర్ ఎస్ నేతలు చెప్తున్నారు .. ఇవన్నీ తెలియాల్సి ఉంది …