2023 ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది… గెలుపు ధీమాతో ఉన్న కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పారని అందరు
అనుకున్నారు .. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని కేసీఆర్ ను ఓడించి తమ సత్తా ఏంటో చూపించారు ..ప్రజలు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో బీఆర్ఎస్ పార్టీని చూసిన వారికి అర్థమవుతోంది. ఒక్క ఓటమితో పార్టీ పరిస్థితి చిందరవందరగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆ పార్టీ.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకు పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది.
అయితే కాలక్రమేణా ఆ సంతోషం కూడా లేకుండా పోతోందని అంటున్నారు. అయితే కాంగ్రెస్ గెలుపు తర్వాత రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేశారనే చర్చ తెరపైకి వచ్చింది. దాన్ని నిజం చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ కండువాలు కప్పుకొవడం మొదలుపెట్టారు. ఇటీవల ఒకేసారి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. త్వరలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీతో దోస్తీకి బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కేటీఆర్, హరీష్ లు హస్తినలో అదేపనిలో ఉన్నారని చెబుతున్నారు. . అయితే బీజేపీ , బిఆర్ ఎస్ కి ఈ దోస్తీ కుదరకపోతే.. మాజీ మంత్రి హరీష్ రావు తన దారి తాను చూసునేందుకు సిద్దమవుతున్నారని చర్చ తెరపైకి వచ్చింది. పార్టీ మారాలని చూస్తున్నారని… అందులోనే హారీష్ బిజీగా ఉన్నారని సమాచారం. ఈ సమయంలో బీజేపీలో హరీష్ చేరికపై తెలంగాణలో ఆ పార్టీ కీలక నేత ఈటల రాజేందర్ స్పందించారు. ఇందులో భాగంగా… బీజేపీలో చేరే విషయంపై హరీష్ ఆలోచన చేస్తుండవచ్చని, ఈ మేరకు అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో… రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని.. అయితే ఈ విషయంపై ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేమీ కామెంట్ చేయలేనని ఈటల అన్నారు.