ప్రస్తుతం తెలంగాణాలో సైబర్ నేరగాళ్లు ఎక్కువవుతున్నారు … అయితే
ఎలాంటి పరిణామాలని , పరిస్థితులనైనా సైబర్ నేరగాళ్లు తమకి అనుకూలంగా మలచుకుంటున్నారు .. సందర్భానుసారం ఎప్పటికప్పుడు పరిస్థితులకు తమకి అనుకూలంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్ళు.. ఇప్పుడు రైతులను టార్గెట్గా చేసుకున్నారు .
సైబర్ ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.. బ్యాంకుల పేరిట సైబర్ కేటుగాళ్లు మోసాలకు తెరలేపినట్లు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోను నుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని రైతన్నలకు పోలీసులు సూచిస్తున్నారు.చేస్తే ఇంక మీ బ్రతుకు బస్సు స్టాండ్ డే అంటున్నారు … పొరపాటున కూడా లింక్స్ క్లిక్ చేయొద్దని చెప్తున్నారు ..
ఈ లింక్ యాక్సెప్ట్ చేస్తే వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇలా చేస్తే మన కాంటాక్స్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బు దోచేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన కొన్ని గంటలకే సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలపై దాడులు చేయకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు. SMS, ఇమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్ కి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. ఎవరైనా అలా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగు చూడటంతో పోలీసు శాఖ అప్రమత్తమై రైతులని అప్రమత్తంగా ఉండాలని కోరుతుంది .