నరం లేని నాలుక ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. అవి మంచికైతే పెద్దగా అభ్యంతరం ఉండదు. ఆ మాటలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తేనే చిక్కులు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ అధికారి స్మితా సబర్వాల్ ఎదుర్కొంటున్నారు..తెలంగాణ రాష్ట్రంలో స్మిత సబర్వాల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.. ప్రస్తుతం ఈ విషయం పై రచ్చ నడుస్తుంది … స్మితా సబర్వాల్ చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు ఇంత రచ్చకు దారితీస్తుంది ..
ఆ ట్వీట్ వ్యవహారంలోకి వెళ్తే.. !
దివ్యాంగులను ఉద్దేశించి ఐఏఎస్ లో వారికి ప్రత్యేకమైన కోట అవసరం లేదంటూ స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఇక స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల నుంచి, అనేక రాజకీయ పార్టీల ప్రముఖుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది… కొంత వ్యతిరేకత తనపై వస్తుంది … అలాగే కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి … స్మితా సబర్వాల్ కెసిఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా పని చేశారు. మంచి గౌరవాన్ని పొందారు. అప్పట్లో ఎవరో వ్యక్తి ఆమె ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసినప్పుడు తెలంగాణ సమాజం ఆమె వైపు బలంగా నిలబడింది. ఆమె ఓ ఫ్యాషన్ పరేడ్ లో పాల్గొన్న అంశంగా అప్పట్లో దుమారం రేపింది. అప్పుడు కూడా తెలంగాణ సమాజం ఆమెను ఓన్ చేసుకుంది. అంతటి ప్రయారిటీ పొందిన ఆమె ఇప్పుడు సోయి తప్పినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో దివ్యాంగులపై ఏదో వివాదాస్పద ట్విట్ చేసింది. అది తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. స్మితా సబర్వాల్ పెట్టిన పోస్ట్ దివ్యాంగులను ఆందోళనకు గురిచేస్తుందని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత వ్యాఖ్యానించారు. ఐఏఎస్ కావాలంటే అందగత్తెలే ఐఏఎస్ కావాల్సిన అవసరం లేదని బాలలత వ్యాఖ్యానించారు.
స్మితా సబర్వాల్ రాజీనామా..? ఉత్కంఠ గా రాజకీయాలు
0Keep Reading
Add A Comment
Follow Us For More Updates
Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.
© 2024 GoldAndhra | All Rights Reserved