ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఏం చేసిన పెద్ద దుమారమే అవుతోంది.. ఆమె ఏదైనా మాట్లాడితే చాలు రచ్చ అవుతుంది … అయితే కేసీఆర్ ప్రభుత్వ హాయంలో కీలక పాత్ర పోషించిన ఈమె.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా ఉన్నారు… అనంతరం ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై తనదైన శైలిలో ఎక్స్ ద్వారా స్పందిస్తుంటారు. .ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే డైనమిక్ ఐఏస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సంచలన పోస్ట్ చేశారు… ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది … పెద్ద రచ్చకే దారి తీస్తుంది .. స్మితా సబర్వాల్అత్యంత కీలకమైన అఖిల భారత సర్వీస్ నిబంధనలపై చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందే అంటూనే.. అంత్యత కీలక సర్వీసులకు ఈ కోటా ఎందుకంటూ ప్రశ్నించారు. సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన ఉద్యోగంలో కోటా ఎందుకని.. డెస్కుల్లో పని చేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలన్నారు స్మితా సబర్వాల్ అన్నారు …
అదే విధంగా అన్ని వర్గాల నుంచి ఆమెను ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అసలు విషయానికి వస్తే.. మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న 28 ఏళ్ల సైంటిస్ట్ కార్తీక్ అనే వ్యక్తి సివిల్ సర్వీసెస్ కి నాలుగు సార్లు అట్టెంప్స్ ఇచ్చినప్పటికీ కేవలం ఫిజికల్ కండిషన్ ద్వారా నిరాకరించబడటం జరిగింది. తాజాగా సివిల్ సర్వీసెస్ సెలక్షన్ లలో ఫేక్ డిసేబుల్ సర్టిఫికెట్లు పెట్టి ఐఏఎస్ సాధిస్తున్న వ్యక్తుల గురించి ఆయన స్పందిస్తూ అలాంటి వాళ్ళ వల్లే మాలాంటి వాళ్లకు అవకాశాలు దూరమవుతున్నాయి అని తన బాధను వ్యక్తపరిచారు.. ఈ సందర్భాన్ని గురించి స్మిత సబర్వాల్ ట్వీట్ చేస్తూ.. దివ్యంగులను గౌరవిస్తునరే…విమానయాన సంస్థల్లో పైలట్ గా దివ్యాంగులను తీసుకుంటారా..? అలాంటి వ్యక్తి సర్జన్ గా ఉంటే మీరు ఆ వ్యక్తిపై నమ్మకంతో ఉంటారా..? ఆల్ ఇండియా సర్వీసులైనా ఐఏఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటేనే క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లాలి. గంటలు గంటలు పని చేయాలి. ప్రయాణాలు చేయాలి. ప్రజల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఓపికతోపాటు శారీరక దృఢత్వం చాలా అవసరం. ఇలాంటి వాటికి దివ్యాంగుల కోటా అవసరమా అని నేను అడుగుతున్నానని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
అదే విధంగా ఫిజికల్ ఫిట్నెస్ అనే దానిమీద ఆమె ఎలాగైనా కూడా తన ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు .కానీ డిజేబుల్ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ మాట్లాడడంతో..న్యాయవాదులు, ఎంపీలు, ఇతర సంఘాలు ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు.. అలాగ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కరుణ స్పందిస్తూ… ఈ ఐఏఎస్ అధికారికి వైకల్యం గురించి అంతగా అవగాహన లేదనిపిస్తోంది. చాలా వైకల్యాలు స్టామినా, తెలివితేటలపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇలాంటి వాళ్లకు జ్ఞానోదయం చాలా అవసరం అని ఈ ట్వీట్ రుజువు చేస్తోంది. అని తీవ్రంగా స్పందించారు. కరుణ ట్వీట్‌కు స్మితా సబర్వాల్ రియాక్ట్ అయ్యారు… నాకు ఉద్యోగ అవసరాల గురించి తెలుసు. ఇక్కడ సమస్య గ్రౌండ్ జాబ్ కు సంబంధించిన అనుకూలతపై మాత్రమే చర్చ. ప్రభుత్వంలోని డెస్క్, థింక్ ట్యాంక్ స్వభావం కలిగిన ఇతర సేవలకు ఇలాంటి వాళ్లు బాగా సరిపోతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. దయచేసి ఓ నిర్ణయానికి రావద్దు. అని అన్నారు. ఈ పోస్టు చూస్తుంటే బ్రూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలతో, ప్రత్యేక అధికారులు ఎలా ఆలోచిస్తారో తెలియజేస్తుందని అన్నారు ఎంపీ ప్రియాంక చతుర్వేది. ఈ పోస్టుపై కూడా స్మితా సబర్వాల్ స్పందించారు…