తెలంగాణ లో అతిపెద్ద శ్రీ వేంకటేశ్వరుని ఆలయం భువనగిరి పట్టణంలో స్వర్ణగిరి దేవాలయం ఉంది … ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి .. ప్రజలు అక్కడకి కుప్పలు కుప్ప్పలుగా వస్తున్నారు … అతి టూరిజం ప్లేస్ లాగా తలపిస్తుంది … దితి భక్తుల రద్దీ పెరిగింది … అసలు స్టోరీ ఏంటంటే ?
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని ఆలయాన్ని .. అద్భుత శిల్పకళతో అధునాతన హంగులతో మది పులకించేలా తీర్చిదిద్దిన ఆలయం భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి ఆలయం ‘.. యాదాద్రి తిరుమల దేవస్థానంగా రూపుదిద్దుకుందన్న ఈ ఆలయం యద్రాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయం తర్వాత అంతటి ప్రసిద్ధమైన క్షేత్రంగా భక్తుల ఆదరణ చూరగొంటుంది ..అనతికాలంలోనే అశేషమైన భక్త సందోహంతో తులతూగుతున్న ఆ ఆలయం గురించి ..ఆలయ విశిష్టతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం
స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మన దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని ప్రాణప్రతిష్ట నాదే త్రిదండి చినజీయర్‌స్వామి చెప్పినట్టు అశేష భక్త జనసందోహంతో మరో తిరుమలగా ఖ్యాతికెక్కుతుంది .. వ్యాపారవేత్తలు అయిన మానేపల్లి కుటుంబ మహోన్నత ఆలోచనలకి కార్యరూపమే ఈ క్షేత్రం .
ప్రముఖ వ్యాపార వేత్త మానేపల్లి రామారావు, శ్రీమతి విజయ లక్ష్మీ దంపతుల సంకల్పంతో .. వారి కుమారులు మానేపల్లి మురళీకృష్ణ, మానేపల్లి గోపీకృష్ణ ల నేతృత్వం లో అత్యంత వైభవంగా ఈ ఆలయం నిర్మింపబడినది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో .. కొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించబడింది ..
పల్లవ, చోళ , చాళుక్య , విజయ నగర , నాయక వంటి వివిధ రాజవంశీయులు శిల్ప రీతులతో ఈ ఆలయాన్ని నిర్మించారు .. DNV ప్రసాద్ స్థపతి తన అసమాన ప్రతిభతో
ఈ మహా ఆలయానికి రూపకల్పన చేసారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులు ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు .. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మితమైంది .. నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు ఉన్నాయి. ఆలయ ప్రధాన దైవం వేంకటేశ్వరుని విగ్రహం 12 అడుగుల ఎత్తులో తీర్చిదిద్దారు .
2018లో ఆలయ నిర్మాణం ప్రారంభమై 2024లో పూర్తయింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన జీయర్ స్వామి 2024 మార్చి 7న దీనిని ప్రతిష్ఠించారు ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయంలో . తూర్పు వైపున ఉన్న ప్రధాన రాజగోపురం 108 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో మహామండపం , కల్యాణ మండపం , యాగశాల సహా అనేక మండపాలు ఉన్నాయి. వేంకటేశ్వరుని విగ్రహం పక్కన అతని ఇద్దరు భార్యలు శ్రీదేవి , భూదేవి విగ్రహాలు కొలువై ఉన్నాయి.. అలాగే ఆలయంలో మదన గోపాల కృష్ణ స్వామి, గరుడాల్వార్, శ్రీరామానుజాచార్యుల ఉపాలయాలు ఉన్నాయి. సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి, శ్రీలక్ష్మీ నరసింహస్వామి, అలాగే భూ వరాహస్వామి, వకుళమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు, మ జలనారాయణ మూర్తి విగ్రహాహలు ఉన్నాయి . 40 అడుగుల ఎత్తయిన రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది .. తిరుమల మొదటి మెట్టు అలిరిపి లో శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. అలాగే స్వర్ణగిరి మొదటిమెట్టు వద్ద శ్రీవారి పాదాలను ప్రతిష్టించారు . ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు ఉన్నారు .22 ఎకరాల సువిశాల ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయంలో అణువణువు భక్తి పారవశ్యంలో మనల్ని మైమరపిస్తుంది .. యాదాద్రి దేవాలయానికి వెళ్లే మార్గ మద్యమంలో ఉండటం, శివారు ప్రాంతం కావడం, అలాగే నేటితరానికి ప్రీతిపాత్రమైన సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణలోనే అతిపెద్దయినా ఈ ఆలయం ఒకసారి దర్శించుకుంటేనే ఆ అనుభూతి అర్ధం అవుతుంది .. భువనగిరి వంటి చారిత్రక ప్రాధాన్యత గలిగిన ప్రాంతంలో కలియుగ దైవం అద్భుత శిల్పకళతో అలరారుతుంటే దర్శంచుకోకుండా ఎలా ఉండగలం .
భువనగి ప్రాకృతిక అంద చందాల నడుమ ఎంతో సుందరముగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ కి ఆతీ సమీపంలోనే ఉంది . హైదరాబా కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి మార్గంలో భువనగిరి సమీపంలో కొలువై ఉంది . స్వర్ణగిరి ఆలయానికి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సైతం హైదరాబాదు నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఉప్పల్ ఎక్స్ రోడ్, జేబీఎస్ ల నుంచి ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉన్నాయి ..
స్వర్ణగిరి ఆలయం సమీపంలో యాత్రికులకు వసతి, ఆహారం వంటి సౌకర్యాలు ఉన్నాయి . అనేక అతిథి గృహాలు ఉన్నాయి.. ఇక భువనగిరి రైల్వే స్టేషన్ కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ కి ఆటే సమీపంలోకొలువైన స్వర్ణగిరి’ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మీరు దర్శించి ఆ శ్రీనివాసుని సేవలో తరించవచ్చు ..