ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్ళికి వేల్యూ లేకుండా పోతుంది … ప్రేమించి పెళ్లి చేసుకొని కూడా విడాకుల దారి పడుతున్నారు …అందులో సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని … విడిపోయి జీవిస్తున్నారు … ఇలా చెప్పుకుంటూ పొతే సినిమా ప్రపంచంలో చాల మంది ఉన్నారు … ఇందులో భాగంగా హార్ధిక్ పాండ్యా పేరు వినిపిస్తుంది …
క్రికెట్ ఇష్టపడే వాళ్లకు హార్ధిక్ పాండ్యా గురించి పరిచయాలు అవసరం లేదు .. హార్ధిక్ పాండ్యా కిఅమ్మాయిల ఫాలోవింగ్ ఎక్కువగా ఉంది …
అయితే స్టార్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి షాకింగ్ విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి .. కొద్దిరోజులుగా విడాకులపై
సోషల్ మీడియా లో ట్రోలింగ్ జరుగుతుంది … హార్ధిక్ పాండ్యా నటాషా విడిపోయారని .. దీనిపై అధికారికంగా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు … ఈ విషయంలో అభిమానులకు షాకింగ్ ఇచ్చారు హార్ధిక్ పాండ్యా అనే చెప్పాలి .. తన భార్య నటాషాతో విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరు విడిపోతున్నారని పాండ్యా అధికారిక ప్రకటన చేయడంతో స్పష్టత వచ్చింది. ఈ కఠిన సమయంలో తమకు సపోర్ట్‌గా నిలుస్తూ.. తమకు కాస్త ప్రైవసీ కల్పించాలని పాండ్యా కోరాడు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం హార్ధిక్ పాండ్యా విషయంలో మరో సంచలన విషయం అంటూ ఒక ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు.
హార్ధిక్ పాండ్యా ప్రేమించి డేటింగ్ చేసి.. పెళ్లి చేసుకున్న భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్ విడిపోయాడు. ఇక ఎవరి దారులు వారివేనని ప్రకటనలో తెలిపాడు. అయితే విడాకులు పొందినా కూడా కుమారుడు అగస్త్య హార్దిక్తోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న నటాషా కొన్ని రోజుల కిందట సెర్బియాకు వెళ్లిపోయింది.నాలుగేళ్లుగా కలిసి ఉన్న అనంతరం నటాషా, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కలిసి జీవించేందుకు చాలా ప్రయత్నించాం. కానీ మా ఇద్దరికి ఇది కఠిన నిర్ణయమే అయినా ఇది మాకు మేలు చేస్తుందని నమ్ముతున్నాం. మేము కలిసి ఆనందించిన సమయం, పరస్పర గౌరవం, ఒక కుటుంబంగా ఎదిగాం. ఈ ప్రయాణాన్ని మేం ఆనందించాం. మా అబ్బాయి అగస్త్యకు అండగా ఉంటాం. వాడిని సంతోషంగా ఉంచడం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. .
ఈ కష్ట సమయంలో మా గోప్యతను గౌరవిస్తూ అండగా ఉంటాలని కోరుకుంటున్నాని పాండ్యా, నటాషా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.క్రికెట్పరంగాను.. వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ పాండ్యా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టును ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన హార్దిక్ అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించాడు. జట్టు ట్రోఫీ సాధించడంలో హార్దిక్ పాత్ర మరువలేనిది. ఐపీఎల్లో ఆటపరంగా శ్రద్ధ కనబర్చకపోవడానికి కారణం విడాకుల గొడవనే కారణంగా గెలిసింది… అదొక రీసన్ అని చెప్పుతున్నారు నీటిజెన్స్ …
హార్ధిక్ పాండ్యా లవ్ స్టోరీ ..:
సెర్బియా దేశానికి చెందిన మోడల్ నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్ ప్రేమ వ్యవహారాలు నడిపించాడు.ఇద్దరు గాడంగా ప్రేమించుకున్నారు ..ఒకరిపై ఒకరికి ప్రేమ చాలా ఉంది ..
అనంతరం వీరిద్దరూ కలిసి రెండేండ్లు సహజీవనం చేశారు. 2019 డిసెంబర్ 31వ తేదీన నటాషాకు దుబాయ్‌లో పాండ్యా ఉంగరం తొడిగాడు. ఆ తర్వాత 2020లో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వారికి అగస్త్య అనే ఒక బాబు ఉన్నాడు. 2023 ఫిబ్రవరి 14న ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో హిందూ, క్రైస్తవ సంప్రదాయంలో మరోసారి అంగరంగ వైభవంగా హార్దిక్, నటాషా పెళ్లి చేసుకున్నారు.సవ్యంగా సాగుతున్న వారి కాపురంలో కొన్ని నెలలుగా కలహాలు మొదలయ్యాయి. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోవాలని ఎప్పుడో డిసైడయ్యారు. అందులో భాగంగా కొన్ని నెలల కిందట నటాషా తన సోషల్ మీడియాలో హార్దిక్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించింది. ఇంకా పేరు పక్కన పాండ్యా అనే పేరును తీసేసింది. ..
అప్పట్లో ‘ఒకరు రోడ్డున పడబోతున్నారు’ అని ఒక పోస్టు చేయడంతో హార్దిక్ పాండ్యానే తన ద్వారా రోడ్డున పడనున్నాడని ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది.అయితే నటాసా విదేశీయురాలు కావడంతో విడాకుల వ్యవహారం కీలకమైనది. విదేశస్తురాలిని పెళ్లి చేసుకోవడంతో హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వడంతో భారీగా ఆస్తిని కోల్పోయినట్టు తెలుస్తోంది. విదేశీయురాలితో విడాకులు తీసుకుంటే దాదాపు 70 శాతం ఆస్తులు భరణం కింద రాసి ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా మనదేశ చట్టాలు ఉన్నాయి. విడాకులు పొందిన హార్దిక్ పాండ్యా నటాషాకు 70 శాతం ఆస్తులు భరణం కింద ఇవ్వాల్సి ఉంటుంది.
ఎప్పటికైనా విడాకులు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన హర్దిక్ ముందు జాగ్రత్త పడ్డాడు. ఆస్తులన్నిటిని తన తల్లి పేరిట రాయించుకున్నాడు. తాను సంపాదించిన ప్రతి రూపాయిలో 50 పైసలు తన తల్లి పేరిట రాస్తున్నట్లు చాలాసార్లు చెప్పాడు. అతడి ఆస్తులు దాదాపుగా తల్లి పేరు మీదుగానే ఉన్నాయి. నామమాత్రంగా మాత్రమే హార్దిక్ తన ఆస్తులను రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడు అదే హార్దిక్ మేలు చేసే అవకాశం ఉంది. తల్లి పేరిట సగం ఆస్తులు ఉండగా.. హార్దిక్ తన పేరు మీద అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్నాడు. విడాకులు తీసుకోవడం చట్టం ప్రకారం నటాషాకు హార్దిక్ తన ఆస్తుల్లో 70 శాతం రాసి ఇచ్చి ఉంటాడు..