Home Telugu హీరో దర్శన్ అరెస్టు తీవ్ర సంచలనం

హీరో దర్శన్ అరెస్టు తీవ్ర సంచలనం

by malakapalli
0 comment
Darshan Arrest - Gold Andhra

కన్నడ నటుడు మరియు ఫ్యాన్స్ ముద్దుగా బాస్ అనిపించుకునే హీరో దర్శన్ అరెస్టు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అతనితోపాటు అతని స్నేహితురాలు నటి పవిత్ర గౌడ కూడా అరెస్టయ్యారు. రేణుక స్వామి అనే యువకుడ్ని హత్య చేసిన ఆరోపణలపై వీరిద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

కాగా దర్శన్ కి దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వారికో కుమారుడు కూడా ఉన్నాడు. దర్శన్ కొనేళ్లగా పవిత్ర గౌడ్ తో కలిసి ఉంటున్నారు. అయితే కొద్ది నెలల క్రితం ఆమె ఇన్స్టాల్ లో షేర్ చేసిన ” మా బంధానికి పదేళ్లు ” అన్న వీడియో కలకలం సృష్టించింది.

ఈ సంబంధం వల్ల విజయలక్ష్మి కి అన్యాయం జరుగుతుందని బాధతో రేణుక స్వామి అనే యువకుడు తన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి పవిత్ర గౌడ్ లక్ష్యంగా చేసుకొని అశ్లీల సందేశాలు మరియు తీవ్ర హెచ్చరికలు చేస్తూ వచ్చాడని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే ఈ హత్యకు కారణం అని మరియు హత్య అనంతరం మృతదేహాన్ని తరలిస్తే తమకు 30 లక్షలు ఇస్తామని దర్శన్ తనకు ఆఫరించారని ముగ్గురు నిందితులు తెలిపారు.

అయితే దర్శన్ హత్య కేసులో ఇరుక్కోవడంతో అభిమానులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ చుట్టుముట్టడంతో పోలీస్ స్టేషన్కు వచ్చిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయవలసి వచ్చింది.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved