Home » అయోధ్య రామ మందిరంలో కాల్పులు

అయోధ్య రామ మందిరంలో కాల్పులు

by malakapalli
0 comment
Ayodhya Temple

అయోధ్య రామ మందిరం కాంప్లెక్స్ లో ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకున్న కాల్పులు అందరిని ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురిచేశాయి. నేడు తెల్లవారుజామున 5:25 నిమిషాలకు రామజన్మభూమి భద్రత కోసం ఉన్న ఒక ఎస్ఎస్ఎఫ్ జవాన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆకస్మికంగా జరిగిన కాల్పులతో రామజన్మభూమి వద్ద జవాన్  కుప్పకూలిపోయాడు.  ఒక్కసారిగా కాల్పుల శబ్దం విని ఘటనా స్థలానికి సైనికులు పరుగులు తీస్తూ వచ్చారు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న జవాన్ ను గుర్తించారు. ఆ జవాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే కాల్పులకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు.

జవన్ ను అంబేద్కర్ నగర్ కు చెందిన 25 సంవత్సరాల శత్రుజ్ఞ విశ్వకర్మ గా గుర్తించారు. అతను ఉత్తర ప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.

జవాను తన సొంత రైఫిల్ తో కాల్చిన గాయంతో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని సందర్శించిన సీనియర్ పోలీసు అధికారులు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  ఇక సంఘటనా స్థలంలో ఆధారాలను ఫోరెన్సిక్ బృందం సేకరిస్తుండగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.

గతంలో మార్చిలో కూడా ఆలయ భద్రత కోసం మోహరించిన పిఏసి ప్లాటూన్ కమాండర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇక ఇప్పుడు మళ్లీ ఈ జవాన్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ప్రభుత్వ స్పందన ఏంటి అన్నదానికోసం వేచి చూడాలి.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved