Home » ఆర్టికల్ 101(2) ఎందుకు సవరించ కూడదు

ఆర్టికల్ 101(2) ఎందుకు సవరించ కూడదు

by malakapalli
0 comment
Hanuman Beniwal

ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి లోక్ సభ కు ఎంపిక అయితే రెండు సభల్లోనూ కొనసాగేలా నిబంధన ఉండాలని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ నేత హనుమాన్ బెనివాల్ కొత్త వాదనతో ముందుకు వచ్చారు. రాజస్థాన్లోని నౌఘడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన ఈయన ఈ వాదనను తీసుకొచ్చారు.

అమెరికాలో ఇటువంటి నిబంధన ఉందని భారత దేశంలో కూడా ఉంటే చాలా బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం విధానసభ సభ్యుడిగా లోక్సభ సభ్యుడిగా ఒకే సమయంలో కొనసాగడానికి వీలు లేదు. అయితే విదేశాలలో ఉన్న ఈ అవకాశం భారత్ లో ఎందుకు ఉండకూడదు అంటూ ప్రశ్నించారు దీనిపై ఆర్టికల్ 101(2) ఎందుకు సవరించ కూడదు అని ఆయన ప్రశ్నించారు.

కాగా త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపై ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకానికి వ్యతిరేకంగా పోరాడతాము అని, పాత పద్ధతిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు అవసరమైతే ఇందుకోసం ఒక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved