భారత దేశం లో పెళ్లిని చాలా పవిత్రంగా చూస్తారు .. అలాగే
భారతీయ వైవాహిక జీవితంలో పెళ్లి అనే బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ పెళ్లి బంధం ఇద్దరు వ్యక్తులని ఒకటి చేయడమే కాకుండా ఒక కొత్త జీవితానికి నాంది పలుకుతుందని అందరూ భావిస్తారు…7 అడుగుల బంధంతో ఇద్దరినీ ముడిపడేలా చేస్తుంది పెళ్లి … అంతటి శక్తి ఉంది పెళ్ళికి ..ఎక్కడో పుట్టి … ఎక్కడో పెరిగి చివరికి పెళ్లి అనే పేరుతో ఇద్దరినీ ఒకటి చేసి … వాల్ల మధ్య ప్రేమ చిగురించేలా చేయగల పవర్ పెళ్ళికే ఉంది … సో దీంతో మామూలుగా పెళ్లి, ప్రేమవంటి బంధానికి విలువ ఇచ్చే వాళ్ళు ఒకటి లేదా రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఆ దేశంలో మాత్రం ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు…
వామ్మో వింటేనే షాక్ అవుతున్నారు కదా … అసలు ఆ స్టోరీ ఏంటి 8 మందిని ఎలా పెళ్లి చేసుకొని అందరిని సంతోష పెడుతున్నారు చూద్దాం .. ఒక్క పెళ్ళికే మనోళ్లు తలలు బాదుకుంటారు ఏకంగా 8 పెళ్లిళ్లు అంటే మామూలోడు కాదు …
పూర్తి వివరాల్లోకి వెళితే థాయిలాండ్ దేశంలో ఓంగ్ డామ్ సొరట్ అనే అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై టాటూ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. కాగా తాజాగా ఓంగ్ డామ్ సొరట్ తన ప్రేమ పెళ్లిళ్ల గురించి థాయిలాండ్ కి చెందిన ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను తన ఎనిమిది మంది భార్యలని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చాడు… విన్న యాంకర్ షాకయ్యి … వివరాలు అడిగితె .. అప్పుడు తెల్సింది స్టోరీ … !
ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ..
ప్రస్తుతం తాము 8 మంది భార్యలతో అందరూ కలిసి ఒకే ఇంట్లో చాలా సంతోషంగా గడుపుతున్నామని తెలిపాడు. ఈ క్రమంలో తన భార్యలలో దాదాపుగా ఐదు మందిని తాను సోషల్ మీడియా మాధ్యమాలలో చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. ఇక మరో ఇద్దరిని సినిమా షూటింగులలో చూసి ప్రేమించానని చెప్పుకొచ్చాడు. ఇక తన 8మంది భార్యలు కూడా ఒక్కో రంగంలో ఉద్యోగం చేస్తున్నారని దాంతో తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు, విభేదాలు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామని స్పష్టం చేశాడు.దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.